జడియకుము నే నే - YouWorship
Jadiyakumu Ne Ne
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
జడియకుము నే నే యున్నానని - కడు నెనరు వాక్కిచ్చిన యేసుని - 'యడుగుజాడలు వెంబడించి - నడుచుకొనరాదా - జీవా = యిడుమ లధికము గలిగిన ప్రభుని - కడకుం జేరరాదా ||జడియకుము|| 1... ఇప్పుడు నిను బాధపరచెడి -ముప్పులం దలపోసి తప్పక - గొప్ప (ప్రేమార్ధంపు శిక్షకు - నొప్పియుండరాదా - నీ = తప్పులన్ విడి ప్రభువు నందు - మెప్పు బొందరాదా || జదియకుము|| 2. ఘనము ధనము సౌఖ్యంబు బోయి - వ్య - సనము శోధన మున్న యోబు - మనసు దృఢము చేసి ప్రభుని - మహిమ పరపలేదా - నీ = మనసు దృఢంబటుల జేసి - మహిమ పరపరాదా || జడియకుము|| 3. లాజరుండు భువిని - బాధ నొందిన సాదృశ్యంపు - బోధన నీ మానసమున - పాదుకొనలేదా - యతం = డాదరింపంబడిన విధము - మోద మియ్యలేదా ||జడియకుము|| నమ్మిక - నెమ్మది 319 4. మున్ను స్తెఫనును రాళ్లతోం గొట్టు - చున్న పగతుర కొరకు దేవుని - మిన్ను వైపునం జూచి యోర్చి - మన్న నడుగలేదా - నీ = కున్న శ్రమలటు లోర్బం బ్రభువు - తెన్నుం జూపలేడా ||జడియకుము|| 5. భక్త జనులను ఖైదుకు నీడ్చి - బాధలు గావించినప్పుడు - శక్తి హీనుల మంచు యేసుని - శక్తి నమ్మలేదా - యా = యుక్తసహాయము దొరకువరకా - సక్తి నుండలేదా ||జడియకుము|| Jadiyakumu Ne Ne Yunnaanani - Kadu Nenaru Vaakkichchina Yesuni - 'Yadugujaadalu Vembadinchi - Naduchukonaraadaa - Jeevaa = Yiduma Ladhikamu Galigina Prabhuni - Kadakun Jeraraadaa ||Jadiyakumu|| 1... Ippudu Ninu Baadhaparachedi -Muppulan Dalaposi Thappaka - Goppa (Premaardhampu Shikshaku - Noppiyundaraadaa - Nee = Thappulan Vidi Prabhuvu Nandu - Meppu Bondaraadaa || Jadiyakumu|| 2. Ghanamu Dhanamu Saukhyambu Boyi - Vya - Sanamu Shodhana Munna Yobu - Manasu Drudhamu Chesi Prabhuni - Mahima Parapaledaa - Nee = Manasu Drudhambatula Jesi - Mahima Paraparaadaa || Jadiyakumu|| 3. Laajarundu Bhuvini - Baadha Nondina Saadrushyampu - Bodhana Nee Maanasamuna - Paadukonaledaa - Yathan = Daadarimpambadina Vidhamu - Moda Miyyaledaa ||Jadiyakumu|| Nammika - Nemmadi 319 4. Munnu Sthephanunu Raallathon Gottu - Chunna Pagathura Koraku Devuni - Minnu Vaipunan Joochi Yorchi - Manna Nadugaledaa - Nee = Kunna Shramalatu Lorban Brabhuvu - Thennun Joopaledaa ||Jadiyakumu|| 5. Bhaktha Janulanu Khaiduku Needchi - Baadhalu Gaavinchinappudu - Shakthi Heenula Manchu Yesuni - Shakthi Nammaledaa - Yaa = Yukthasahaayamu Dorakuvarakaa - Sakthi Nundaledaa ||Jadiyakumu||