చూడ గోరెద - YouWorship
Chooda Goreda
Artist: ఎం. జే. రామాంజులు
Category: Praise & Worship
Song Lyrics
చూడ గోరెద - దేవ - మందిరావరణములను - చూడ గోరెద = చూడ నాకు నాశ గలదు - సుందరావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో - సొమ్మసిల్లుచున్నదహా ||చూడ|| 1. నీదు నివాసములు జూడ - నెంతో రమ్యమై తనర = నాదు హృదయమునకు నా - నంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ|| 2. జీవము గల ప్రభుని జూడ - జీవి నాలో కేక వేసె = కోవెలలకు దొరికె గూటి - తావు నీ మందిరమున ||చూడ|| 3. పిచ్చుకలకు దొరికె స్థలము - ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు కుతూహలముతోను - పిల్లల నవి మందిరమున ||చూడ|| 4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైనవారు = నిక్కముగను ధన్యులగుచు - నిన్ను నన్నుతింతు రహో ||చూడ|| 5. ప్రభుని వలన బలము నొందు - ప్రజలు ధన్యులగుదు రిల = ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ|| 6. నీదు యావరణములలో - నేను నొక్క దినము గడుప = నెంతో విలువ గల నాకు - వేరినాళ్లు బ్రతుకు కన్న ||చూడ|| 7. కానరండు మనము నిపుడే - మనము లలర ప్రభుని జూడ = మందిరమున కేగి నిండు - మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ|| Chooda Goreda - Deva - Mandiraavaranamulanu - Chooda Goreda = Chooda Naaku Naasha Galadu - Sundaraavaranamu Lavi = Chooda Naadu Praanamentho - Sommasilluchunnadahaa ||Chooda|| 1. Needu Nivaasamulu Jooda - Nentho Ramyamai Thanara = Naadu Hrudayamunaku Naa - Nanda Michchu Nipudu Nepudu ||Chooda|| 2. Jeevamu Gala Prabhuni Jooda - Jeevi Naalo Keka Vese = Kovelalaku Dorike Gooti - Thaavu Nee Mandiramuna ||Chooda|| 3. Pichchukalaku Dorike Sthalamu - Muchchata Balipeetha Meduta = Pettu Kuthoohalamuthonu - Pillala Navi Mandiramuna ||Chooda|| 4. Needu Mandirambulona - Nithyavaasulainavaaru = Nikkamuganu Dhanyulaguchu - Ninnu Nannuthinthu Raho ||Chooda|| 5. Prabhuni Valana Balamu Nondu - Prajalu Dhanyulagudu Rila = Praana Priyamu Yaathra Seyu Prajala Maarga Mamara Dharanu ||Chooda|| 6. Needu Yaavaranamulalo - Nenu Nokka Dinamu Gadupa = Nentho Viluva Gala Naaku - Verinaallu Brathuku Kanna ||Chooda|| 7. Kaanarandu Manamu Nipude - Manamu Lalara Prabhuni Jooda = Mandiramuna Kegi Nindu - Manashshaanthi Bondi Brathuka ||Chooda||