చూడుము సోదరుడా నీవు - YouWorship
Choodumu Sodarudaa Neevu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై - వేడుము స్నేహితుడా (2) 1. లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్ (2) చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా (2) నమ్ముము సోదరుడా (1) 2. దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా రావో సోదరుడా 3. నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై కలువరి చెంతకు రా 4. మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై పరుగిడిరా ప్రియుడా 5. యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది యేసే ఒసగును రా 6. హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో స్తుతులను పాడను రా Pallavi: Choodumu Sodarudaa Neevu - Nede Lechi Rakshana Korakai - Vedumu Snehithudaa (2) 1. Lemmu Neeku Veluguvachchenu - Kammuchunnadi Cheekati Lokamun (2) Chimmacheekati Janamula Gammenu - Nemmadi Nondaga Lechi Raa (2) Nammumu Sodarudaa (1) 2. Devuni Vaakyamu Velugaiyunnadi - Aa Veluge Neeku Jeevamaiyunnadi Nee Venuke Aa Jeevamu Nilachenu - Jeevamu Nondaga Vegame Raa Raavo Sodarudaa 3. Niluvumu Nee Jeevamu Aaviriye - Ilalo Ledika Needani Cheppedu Kalushamu Lellanu Kadugunu Kreesthu Niluchunu Ila Nee Kaapariyai Kaluvari Chenthaku Raa 4. Morrapettumu Nede Lechi - Sarichesikoni Jeevithamantha Parishuddha Rakthadhaaralatho - Parishuddhadu Nilachenu Neekai Parugidiraa Priyudaa 5. Yesuni Nammedi Vaarilalona - Yesuni Jeevamu Pondina Vaarai Bhaasurambugaa Mokshamu Jera - Nilchedaru Shakthini Bondi Yese Osagunu Raa 6. Hallelooya Paadumu Nede - Vallabhundesu Vachchunani Ella Prajalu Choocheda Resun - Challani Prabhooraakan Ilalo Sthuthulanu Paadanu Raa