చూచుచున్నాము నీ వైపు - YouWorship
Choochuchunnaamu Nee Vaipu
Artist: పులిపాక జగన్నాధము
Category: Praise
Song Lyrics
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| మేమరులమై యుంటిమి మార్గము వీడి – మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| నిను నమ్ము పాపులకు వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు|| నీ భయము మాయెదలను నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము – వైభవ మొందుచు నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు|| దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి – దయచేయుమని కోర దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు|| Choochuchunnaamu Nee Vaipu Maa Priya Janaka – Choochuchunnaamu Nee Vaipu Choochuchu Nee Prema – Sompu Suvaarthanu Jaachuchu Garamulu – Chakkagaa Neevaipu ||Choochu|| Memarulamai Yuntimi Maargamu Veedi – Memandaramu Pothimi Premache Nappudu – Priya Thanayu Nampinchi Kshema Maargamu Maaku – Bremanu Joopithivi ||Choochu|| Ninu Nammu Paapulaku Vaarevaraina – Nee Sharamu Jochchuvaaralaku Inudavu Kedembu – Nee Jagathilo Naguchu Ganuparachuchunduvu – Ghanamaina Nee Krupa ||Choochu|| Nee Bhayamu Maayedalanu Nilupumu Needu – Praabhava Monaranganu Nee Bhayamuche Memu – Vaibhava Monduchu Ne Bhayamu Lekunda – Nee Bhuvini Gonnaallu ||Choochu|| Daya Joochi Mamu Neppudu Manchivi Yanni – Dayacheyu Mellappudu Dayacheyaraanivi – Dayacheyumani Kora Daya Joopi Manninchu – Dayagala Maa Thandri ||Choochu||