చూచితి నీ మోముపై - YouWorship
Choochithi Nee Momupai
Artist: ఎం జ్యోతి రాజు
Category: Good Friday
Song Lyrics
చూచితి నీ మోముపై – చిందిన రక్తము తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు.. ||చూచితి|| నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2) మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2) యేసు.. ||చూచితి|| సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2) మా రోగములను – భరియించుటకు (2) మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2) యేసు.. ||చూచితి|| Choochithi Nee Momupai – Chindina Rakthamu Thalachithi Nee Premanu – Madiki Andanidaaye Raaja Makutamu Maaripoye – Mulla Makutamugaa Simhaasaname Siluvaga Maari – hikshaku Guriyaayegaa Parimithi Leni Kaluvari Premanu Parihaasamu Chesire Aa Premanerigi Nee Paada Sevaye – Chaalani Nee Chentha Cherithini Yesu… ||Choochithi|| Nelapai Olikina Nee Raktha Dhaarale – Prathi Paapini Kadigenu Aa Rakthadhaarale Paapiki Maargamai – Paramuku Pravahinchenu (2) Matti Dehamunu – Mahimaga Maarchutaku (2) Maapai Neekunna Sankalpa Premanu – Parihaasamu Chesire (2) Yesu… ||Choochithi|| Siluvalo Chindina Rakthapu Jallulu – Prathi Rogini Thaakenu Chithikina Dehamuna Olikina Rudhiramu – Paramoushadhamaayenu (2) Maa Rogamulanu – Bhariyinchutaku (2) Maapai Neekunna Enaleni Premanu – Avahelana Chesire (2) Yesu… ||Choochithi||