చుక్క పుట్టింది - YouWorship
Chukka Puttindi
Artist: మోజెస్ డేవిడ్ కళ్యాణపు
Category: Christmas
Song Lyrics
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో గొర్రెల విడచి మందల మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనాన్నంటేలా ఘనపరచెదం (2) చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు జగమంతా సందడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో తారను చూచి తరలి వచ్చాము తన భుజముల మీద రాజ్య భారమున్న తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2) బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి Vaakyame Shareera Dhaariyai – Loka Rakshakudu Udayinche Paapaanni Shaapanni Tholagimpanu – Rakshakudu Bhuvikethenchenu Ooru Vaadaa Veedhulalo – Lokamanthaa Sandadantaa Aadedamu Koniyaadedamu – Are Poojinchi Ghanaparachedam Chukka Puttindi Elo Elelo – Sandadi Cheddaamaa Elo Raaju Puttinaadu Elo Elelo – Kolavabodaamaa Elo Gorrela Vidachi Mandala Marachi Gaabriyelu Vaartha Vini Vachchaamammaa Gaanamulatho Ganthulu Vesthu Gaganaannantelaa Ghanaparachedam (2) Cheekatlo Koorchunna Vaari Kosam Neethi Sooryudesu Udayinche Paramunu Cherchanu Arudinche Ee Baalude Maa Raaju – Raajulaku Raaraaju Jagamanthaa Sandadi Cheddaam Polamunu Vidachi Elo Elelo – Pooja Cheddaamaa Elo Thaaranu Choochi Tharali Vachchinamu Thoorpu Deshapu Gnaanulamu Thana Bhujamula Meeda Raajya Bhaaramunna Thanayudevaro Chooda Vachchaamammaa (2) Baaluniki Memu Arpinchaamu Maa Gundello Neekenayyaa Aalayam Maa Madilo Neekenayyaa Simhaasanam Ee Baalude Maa Raaju – Raajulaku Raaraaju Iham Param Andaramu Chukka Puttindi Elo Elelo – Sandadi Cheddaamaa Elo Gnaana Deepthudammaa Elo Elelo – Bhuvikethenchenamma Elo