చింత లేదిక - YouWorship
Chintha Ledika
Artist: ఎన్ డి ఏబెల్
Category: Christmas
Song Lyrics
చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై ||చింత లేదిక|| పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత లేదిక|| Chintha Ledika Yesu Puttenu Vinthaganu Bethlehamanduna Chentha Jeranu Randi Sarva Janaangamaa Santhasamondumaa (2) Dootha Thelpenu Gollalaku Shubhavaartha Naa Divasambu Vinthagaa Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri Sthuthulonarinchiri ||Chintha Ledika|| Chukka Ganugoni Gnaanulentho Makkuvatho Naa Prabhuni Kanugona Chakkagaa Bethlehe Puramuna Jochchiri Kaanukalichchiri ||Chintha Ledika|| Kanya Garbhamunandu Puttenu Karunagala Rakshakudu Kreesthudu Dhanyulagutaku Randi Vegame Deenulai Sarva Maanyulai ||Chintha Ledika|| Paapamellanu Pariharimpanu Parama Rakshakudavatharinchenu Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu Moksha Bhaagyamu ||Chintha Ledika||