ఘనుండైన యెహోవా - YouWorship
Ghanundaina Yehovaa
Artist: విలియం డాసన్
Category: Praise & Worship
Song Lyrics
ఘనుండైన యెహోవా - గద్దె ముందట మోరు వినతు లిప్పుడు చేయుడి - యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండ - నో జనులార ||ఘనుండైన|| 1. ఒక్కండే మన కర్తయుండు దేవుడని యున్ - జక్కగాను సృజియించు సంహరించు ననియున్ - నిక్కముగం దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల - మిక్కుటపు పరిపాలనపు బలముచేం జేసె మృత్తుచే మానవులంగ - దిక్కు గానక తిరుగు గొఱ్ఱెల వలె మనము చెదరం దిరుగందన దొడ్డింబెట్టె - నో జనులారా ||ఘనుండైన|| 2. మే మందరము వందనపు పాటతో మూగి - మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా - మధురలయ సహితముగను భూమియున్ పదివేల జిహ్వల వలం - బొందైన నీ నగరికాధామంబులను గాన సన్నుతి వితతిపూరి - తమ్ములుగం జేయు దేవాయో జనులార ||ఘనుండైన|| 3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ - తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ - పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిచియుండున్ - వర శిలా ఖండ పర్వతము తోడను సాటి - వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార ||ఘనుండైన|| Ghanundaina Yehovaa - Gadde Mundata Moru Vinathu Lippudu Cheyudi - Yojanulaara Vinayambugaa Nirmalaananda Rasalahari Mana Manan Boppuchunda - No Janulaara ||Ghanundaina|| 1. Okkande Mana Karthayundu Devudani Yun - Jakkagaanu Srujiyinchu Sanharinchu Naniyun - Nikkamugan Delisikondee Mana Sahaayame Makkaralekunda Manala - Mikkutapu Paripaalanapu Balamuchen Jese Mruththuche Maanavulangga - Dikku Gaanaka Thirugu Gorrela Vale Manamu Chedaran Dirugandana Doddimbette - No Janulaaraa ||Ghanundaina|| 2. Me Mandaramu Vandanapu Paatatho Moogi - Minchu Nee Gummamulalo Maamaa Svaramu Leththudumu Nabhamu Podavugaa - Madhuralaya Sahithamuganu Bhoomiyun Padivela Jihvala Valan - Bondaina Nee Nagarikaadhaamambulanu Gaana Sannuthi Vithathipoori - Thammulugan Jeyu Devaayo Janulaara ||Ghanundaina|| 3. Dharayantha Visthaaramaiyunnadi Nee Yaajnya - Thaga Virahithaadyanthamai Sthiramaina Kaalambuvalene Yunna Dayadaya - Poralipovuchu Nunnavathsaramul Nilichipoyi Nappatikini Needu - Sathyambu Nilichiyundun - Vara Shilaa Khanda Parvathamu Thodanu Saati - Vanne Kekkuchu Nenthayun O Janulaara ||Ghanundaina||