ఘనమైన వేడుక - YouWorship
Ghanamaina Veduka
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Praise
Song Lyrics
కరుణించి కాపాడే యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా.. కూడుకొని మనమీవేళ ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| పాతవి కడ తేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని|| Karuninchi Kaapaade Yesayyaa.. Yesayyaa… Yesayyaa.. Koodukoni Manameevela Ghanamagu Vedukaku Thera Theeyaalaa (2) Gadachina Dinamula Kaligina Sukhamukai Prabhu Yesu Aasheervaadalakai ||Koodukoni|| Vesavi Vadagaalula Baadha Theeripoye Yesuni Shubha Vaakkula Haayi Praapthamaaye Vidhithamaina Prabhuni Prema Vidichipodaaye Vimalamaaye Hrudaya Seema Digulu Ledaaye Gaanamai Galamuna Paadagaa Dhyaanamai Mansuni Thaakagaa Prabhavinche Yesu Divya Naada Roopaana ||Koodukoni|| Paathavi Kada Theraga Manasu Maaripoye Noothana Kriya Cheyaga Daari Sidhdhamaaye Prabalamaina Siluva Needa Samasipodaaye Samasipoye Shramala Jaada Jayamu Naadaaye Sthothrame Niluvuga Levagaa Dhoopamai Varaduni Cheragaa Thirigochche Thandri Shreshta Roopaana ||Koodukoni||