ఘనత మహిమ ప్రభుకే - YouWorship
Ghanatha Mahima Prabhuke
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఘనత మహిమ ప్రభుకే (2) -తర తరములలో తనకే చెల్లును గాక (1) ఘనత మహిమ ప్రభుకే (1) 1. నీతిమంతుడు మహానీయుడు (2) - స్తుతికీర్తనలతో సన్నుతించెదము (2) అద్భుతములను చేయు దేవుడు (2) - వినుతించెదము విమలాత్ముడని (2) 2. పావన ప్రభుయేసుండు - పరమ దీవెనలు మనకిచ్చెను తరతరములలో ఎరిగిన తండ్రిని - నిరంతరము స్తుతియించెదము 3. మనలను సిలువ రక్తముతో - కొని సమకూర్చెను సంఘముగాను తన శిరసత్వములో మనలుంచి - మనల నడుపు రారాజునకే 4. మాట తప్పని దేవుడేగ - మేటిగ నెరవేర్చె వాగ్దానము ధీటైన జనముగ మము జేసెనుగ - మెండుగ మమ్ము దీవించెనుగా 5. పరమప్రభువు మనకొరకు - అర్పించుకొనెను తన్ను తానే సర్వము మనకు యిచ్చిన ప్రభునే - సర్వద మనము సంస్తుతియించెదము Pallavi: Ghanatha Mahima Prabhuke (2) -Thara Tharamulalo Thanake Chellunu Gaaka (1) Ghanatha Mahima Prabhuke (1) 1. Neethimanthudu Mahaaneeyudu (2) - Sthuthikeerthanalatho Sannuthinchedamu (2) Adbhuthamulanu Cheyu Devudu (2) - Vinuthinchedamu Vimalaathmudani (2) 2. Paavana PrabhuYesundu - Parama Deevenalu Manakichchenu Tharatharamulalo Erigina Thandrini - Nirantharamu Sthuthiyinchedamu 3. Manalanu Siluva Rakthamutho - Koni Samakoorchenu Sangghamugaanu Thana Shirasathvamulo Manalunchi - Manala Nadupu Raaraajunake 4. Maata Thappani Devudega - Metiga Neraverche Vaagdaanamu Dheetaina Janamuga Mamu Jesenuga - Menduga Mammu Deevinchenugaa 5. ParamaPrabhuvu Manakoraku - Arpinchukonenu Thannu Thaane Sarvamu Manaku Yichchina Prabhune - Sarvada Manamu SanSthuthiyinchedamu