గొప్ప దేవ నాకు - YouWorship
Goppa Deva Naaku
Artist: పులిపాక జగన్నాథము
Category: Worship
Song Lyrics
గొప్ప దేవ నాకు తండ్రివి - యాకాశమందు - గొప్ప దేవ నాకుం దండ్రివి తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగం జేర్చుకొనుము ||గొప్ప|| 1. నీవు మిగుల గొప్ప వాండవు - నా సృష్టి కర్త - యీవు లెపుడు నిచ్చు వాండవు భావమందు నినుం దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేండుకొందు ||గొప్ప|| 2. చిన్నవాని నంగి ప్రార్థన - నీ లోకమందు - మున్ను దయను నిన్న వాండవు సన్నుతుండగు యేసు నీదు - సన్నిధి నున్నాండు గాన - నన్నుం గనికరించు మనుచు - నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప|| 3. విలువ గల్లు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధములం దలంచు చుందును బలుకులందుంబనులయందు - బలముం జూపి నిన్నుం గొలిచి యిలను నిన్నుం బ్రీతిపరుతు - నలయక నీ కరుణ మోయి ||గొప్ప|| 4. మింది రాజ్యమందుం జేర్చుము - కరుణాసముద్ర - బీద వాడ నన్నుం గరుణచే సోదరులను గూడికొనుచు - మోద మొప్పంగ నీదు సేవం బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప|| Goppa Deva Naaku Thandrivi - Yaakaashamandu - Goppa Deva Naakun Dandrivi Thappakunda Vaththu Nee - Dariki Yesu Naamamandu - Goppa Karuna Chetha Nannippudu Thagan Jerchukonumu ||Goppa|| 1. Neevu Migula Goppa Vaandavu - Naa Srushti Kartha - Yeevu Lepudu Nichchu Vaandavu Bhaavamandu Ninun Dalanchi - Paavanaathma Naaku Nichchi - Jeevamaargamandu Nilipi Kaavu Manuchu Vendukondu ||Goppa|| 2. Chinnavaani Nanggi Praarthana - Nee Lokamandu - Munnu Dayanu Ninna Vaandavu Sannuthundagu Yesu Needu - Sannidhi Nunnaandu Gaana - Nannun Ganikarinchu Manuchu - Ninnu Nammi Vaththu Nipudu ||Goppa|| 3. Viluva Gallu Needu Naajnyalu - Naa Hrudayamandu - Balu Vidhamulan Dalanchu Chundunu Balukulandumbanulayandu - Balamun Joopi Ninnun Golichi Yilanu Ninnun Breethiparuthu - Nalayaka Nee Karuna Moyi ||Goppa|| 4. Mindi Raajyamandun Jerchumu - Karunaasamudra - Beeda Vaada Nannun Garunache Sodarulanu Goodikonuchu - Moda Moppangga Needu Sevan Baadukonuchu Nundunu Nee Paadapadmamulanubatti ||Goppa||