గీతములు పాడుండీ యేసునికి - YouWorship
Geethamulu Paadundee Yesuniki
Artist: మురారి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
గీతములు పాడుండీ - యేసునికి సం - గీతములు పాడుండీ = పాతకుల మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్నాతులనుగాం జేసి పాపను - భాతకులలో నవతరించెను ||గీతములు|| 1... రాజులకు రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా = బూజలందుచు దూత పరిగణ - పూజితుండౌ ఘనుండు తన దగు - తేజ మెల్లను విడిచి యీయిలం - దేజహీనులలోనం బుట్టెను ||గీతము|| 2. దాసులగు వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ = జేసి వారల నెల్ల మోక్ష ని - వాసులుగం జేయంగ రక్తముం - బోసి కృపచేంగావ వచ్చెను - యేసు నాధుండు దీన వృత్తిని గీతములు! 3. _ మానవుల కెల్లను - దేవుని ప్రేమ - మానుగాం జూపను = 'మ్రానిపై దన రక్త మొసంగంగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేందా - దీనుందై యిమ్మానుయేలు గీతములు! 4 ఆదిం దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన - మేదినిందా మనుజుందై యింక - సాదరమ్మునం బ్రోవ మనుజుల - నా దయాళుండు తనదు దేహము - సాధుగా నర్చింతు ననుచును ||గీతములు|| Geethamulu Paadundee - Yesuniki San - Geethamulu Paadundee = Paathakula Magu Manala Daaruna - Paathakamu Thana Vimalaraktha - Snaathulanugaan Jesi Paapanu - Bhaathakulalo Navatharinchenu ||Geethamulu|| 1... Raajulaku Raajugaa - Neluchu Moksha - Raajyamuna Karthagaa = Boojalanduchu Dootha Parigana - Poojithundau Ghanundu Thana Dagu - Theja Mellanu Vidichi Yeeyilan - Dejaheenulalonan Buttenu ||Geethamu|| 2. Daasulagu Vaaralan - Dama Patu Dosha - Thraasa Vimukthulan = Jesi Vaarala Nella Moksha Ni - Vaasulugan Jeyangga Rakthamun - Bosi Krupachenggaava Vachchenu - Yesu Naadhundu Deena Vruththini Geethamulu! 3. _ Maanavula Kellanu - Devuni Prema - Maanugaan Joopanu = 'Mraanipai Dana Raktha Mosanggangga - Maanavundai Putte Yoodula - Lona Yesanu Peruchendaa - Deenundai Yimmaanuyelu Geethamulu! 4 Aadin Dana Vaakyamu - Nanduna Yesu - Modamun Nitlanena - Medinindaa Manujundai Yingka - Saadarammunan Brova Manujula - Naa Dayaalundu Thanadu Dehamu - Saadhugaa Narchinthu Nanuchunu ||Geethamulu||