గీతం గీతం - YouWorship
Geetham Geetham
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) || గీతం|| చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు || గీతం|| వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి || గీతం|| అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి || గీతం|| గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి || గీతం|| Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) || Geetham || Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu || Geetham || Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi || Geetham || Anna Kayapa Vaarala Sabhayu Adaruchu Parugidiri Inka Dootha Ganamula Dhvanini Vinuchu Vanakuchu Bhayapadiri || Geetham || Gummamul Therachi Chakkaga Naduvudi Jaya Veerudu Raagaa Mee Mela Thaalla Vaadyamul Boora Letthi Dhvaninchudi || Geetham ||