గాయపడిన నీ చేయి - YouWorship
Gaayapadina Nee Cheyi
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) సిలువే నాకు విలువైనది (2) అదియే నా బ్రతుకున గమ్యమైనది ఎంతో రమ్యమైనది ||గాయపడిన|| ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె నీవు ఎదిగితివి (2) సురూపమైనా ఏ సొగసైనా (2) లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన|| మనుషులందరు చూడనొల్లని రూపముగా నాకై మారితివి (2) మా రోగములు మా వ్యసనములు (2) నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన|| నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది (2) నీవు కార్చిన రక్తమే (2) మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన|| Gaayapadina Nee Cheyi Chaapumu Devaa Nee Siluva Rakthamunu Proskhinchumu Naa Prabhuvaa (2) Siluve Naaku Viluvainadi (2) Adiye Naa Brathukuna Gamyamainadi Entho Ramyamainadi ||Gaayapadina|| Endina Bhoomilo Molachina Letha Mokkavale Neevu Edigithivi (2) Suroopamainaa Ae Sogasainaa (2) Lenivaanigaa Naakai Maarithivi ||Gaayapadina|| Manushulandru Choodanollani Roopamugaa Naakai Maarithivi (2) Maa Rogamulu Maa Vyasanamulu (2) Nischayamugaa Neevu Bhariyinchithivi ||Gaayapadina|| Neevu Pondina Debbala Valana Swasthatha Naaku Kaliginadi (2) Neevu Kaarchina Rakthame (2) Maa Andariki Ila Praanaadhaaramu ||Gaayapadina||