గానము జేయుడు సుకీర్తనను - YouWorship
Gaanamu Jeyudu Sukeerthananu
Artist: విలియం డాసన్
Category: Praise & Worship
Song Lyrics
గానము జేయుడు సుకీర్తనను - యెహోవాను గూరిచి క్రొత్త - గాను రక్తిగను ||గానము|| 1. తన్నామము నుతించి యతని - రక్షక - జెన్నుగ సారె బ్రసిద్ధముగ జేసి పన్నుగ నన్యులలో తన్మహిమ - యందున్నత చిత్రములను జాటండి ||గానము|| 2. ఘనతయు మహాత్మ్యమును - ద - ధ్వని యెదుటనుండు - ఘనబలమును = వినతమౌ సౌందర్యమును - న - తనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము|| 3. పరిశుద్ధాలంకారముతో - నా - పరమాత్మారాధన - పరులై యుండండి = ధరణి సకల జనులారా - లోక - గురుని యెదుట భీతి - గోనుచు నుండండి ||గానము|| 4. పరిపాలించుచున్నాడనుచు తోడి - నరులతో చెప్పుడి - ధరణి గదకుండ = స్థిరముగ జేయు సత్యముగా - జనుల - కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము|| 5. ఏమిన నా మహాత్ముండు - వచ్చు - నీ మహికి న్యాయము - నేర్పరచుటకు = భూమి జనులకు నీతి సత్య - ముల - తో మించు న్యాయ మెం - తో విమర్శించు ||గానము|| 6. జనులారా యా యెహోవాకు - మహి - మన బలమును సమర్పణము జేయండి వినయముతో గానుకలను - తీసి - కొని తత్ప్రాకారమందున వసియింపండి ||గానము|| Gaanamu Jeyudu Sukeerthananu - Yehovaanu Goorichi Kroththa - Gaanu Rakthiganu ||Gaanamu|| 1. Thannaamamu Nuthinchi Yathani - Rakshaka - Jennuga Saare Brasiddhamuga Jesi Pannuga Nanyulalo Thanmahima - Yandunnatha Chithramulanu Jaatandi ||Gaanamu|| 2. Ghanathayu Mahaathmyamunu - Da - Dhvani Yedutanundu - Ghanabalamunu = Vinathamau Saundaryamunu - Na - Thanivi Nirmala Sthalamuna Vilasillu ||Gaanamu|| 3. Parishuddhaalankaaramutho - Naa - Paramaathmaaraadhana - Parulai Yundandi = Dharani Sakala Janulaaraa - Loka - Guruni Yeduta Bheethi - Gonuchu Nundandi ||Gaanamu|| 4. Paripaalinchuchunnaadanuchu Thodi - Narulatho Cheppudi - Dharani Gadakunda = Sthiramuga Jeyu Sathyamugaa - Janula - Karimurigaanu Nyaayamu Vimarshinchu ||Gaanamu|| 5. Emina Naa Mahaathmundu - Vachchu - Nee Mahiki Nyaayamu - Nerparachutaku = Bhoomi Janulaku Neethi Sathya - Mula - Tho Minchu Nyaaya Men - Tho Vimarshinchu ||Gaanamu|| 6. Janulaaraa Yaa Yehovaaku - Mahi - Mana Balamunu Samarpanamu Jeyandi Vinayamutho Gaanukalanu - Theesi - Koni Thathpraakaaramanduna Vasiyimpandi ||Gaanamu||