గతకాలమంత నీ నీడలోన - YouWorship
Gathakaalamantha Nee Needalona
Artist: దివ్య మన్నె
Category: Thanksgiving
Song Lyrics
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| ఎన్నెన్నో అవమానాలెదురైననూ నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగిననూ నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| మాటలే ముళ్ళుగ మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నను తాకెనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| Gathakaalamantha Nee Needalona Dachaavu Devaa Vandanam Krupa Choopinavu – Kaapaadinaavu Elaa Theerchagalanu Nee Runam Paadanaa Nee Keerthana – Pogadanaa Venollana – (2) Vandanam Yesayyaa – Ghanudavu Neevayyaa (2) ||Gathakaalamantha|| Ennenno Avamaanaledurainanu Nee Prema Nannu Vidichi Poledayyaa Ikkatlatho Nenu Krunginanu Nee Cheyi Nanu Thaaki Lepenayyyaa Nijamaina Nee Prema Nishkalankamu Neevichchu Hasthamu Nindu Dhairyamu (2) Vandanam Yesayyaa – Ghanudavu Neevayyaa (2) ||Gathakaalamantha|| Maatale Mulluga Maarina Vela Nee Maata Nannu Palakarinchenayaa Nindalatho Nenu Nindina Vela Nee Dakshina Hasthamu Nanu Thaakenayaa Nee Maata Chakkati Jeevapu Oota Maruvanennadu Ninnu Stuthiyinchuta (2) Vandanam Yesayyaa – Ghanudavu Neevayyaa (2) Gathakaalamantha Nee Needalona Dachaavu Devaa Vandanam Krupa Choopinavu – Kaapaadinaavu Elaa Theerchagalanu Nee Runam Paadanaa Nee Keerthana – Pogadanaa Venollana (2)