గడియ నేను తట్టుచున్నాను - YouWorship
Gadiya Nenu Thattuchunnaanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: గడియ నేను తట్టుచున్నాను మూఢముగా నుండక మనసు తెరువుము 1. భోజనము చేయనై శాంతిగా నిల్చుచున్నాను ఆసనమునిచ్చిన ప్రేమను రుచింతువు 2. ఆనందము పొందును నీ హృదయము నాకిమ్ము కష్టదుఃఖముల నెల్ల పారద్రోలెదను 3. నేనే మృతి పొందితిని నీ నాథుడను యేసు రాజును పైన వెళ్ళి తండ్రితో మాటలాడుదు నీకై 4. నా శిరస్సునందు ముండ్ల మకుటము ధరియించితిన్ హేమమకుట మీయను త్రోసినట్టి నీకై 5. తామసము చేయక హృదయమును తెరువుము తెల్లని వస్త్రములతో నిన్నలంకరింతును 6. సైతాను దూతలను పారద్రోలెదను నేను నాతాను ద్వారా నీకు పశ్చాత్తాపమిత్తును 7. హల్లెలూయ పాడి నీ హృదయమును నా కిమ్ము ప్రియుడనైన నేను త్వరగా నీకై వత్తును Pallavi: Gadiya Nenu Thattuchunnaanu Moodhamugaa Nundaka Manasu Theruvumu 1. Bhojanamu Cheyanai Shaanthigaa Nilchuchunnaanu Aasanamunichchina Premanu Ruchinthuvu 2. Aanandamu Pondunu Nee Hrudayamu Naakimmu Kashtaduhkhamula Nella Paaradroledanu 3. Nene Mruthi Pondithini Nee Naathudanu Yesu Raajunu Paina Velli Thandritho Maatalaadudu Neekai 4. Naa Shirassunandu Mundla Makutamu Dhariyinchithin Hemamakuta Meeyanu Throsinatti Neekai 5. Thaamasamu Cheyaka Hrudayamunu Theruvumu Thellani Vasthramulatho Ninnalangkarinthunu 6. Saithaanu Doothalanu Paaradroledanu Nenu Naathaanu Dvaaraa Neeku Pashchaaththaapamiththunu 7. Hallelooya Paadi Nee Hrudayamunu Naa Kimmu Priyudanaina Nenu Thvaragaa Neekai Vaththunu