క్రీస్తే సర్వాధికారి - YouWorship
Kreesthe Sarvaadhikaari
Artist: రావూరి రత్నము
Category: Praise
Song Lyrics
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే|| ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే|| Kreesthe Sarvaadhikaari – Kreesthe Mokshaadhikaari Kreesthe Mahopakaari – Kreesthe Aa Silvadhaari ||Kreesthe|| Mukthi Vidhaatha Netha – Shakthi Nosangu Daatha Bhakthi Vilaapa Shrotha – Paramambu Veede Gaana ||Kreesthe|| Divya Pathamburosi – Daivambu Thodu Baasi Daasuni Roopu Daalchi – Dharani Kethenche Gaana ||Kreesthe|| Shaashwatha Lokavaasi – Sathyaamruthampu Raashi Shaapa Bhaarambu Mosi – Shramala Sahinche Gaana ||Kreesthe|| Saithaanu Janamu Goolpan – Paathaalamunaku Bampan Neethi Pathambu Bempa – Rudhirambu Gaarche Gaana ||Kreesthe|| Mruthyuvu Mullu Thrumpan – Nithya Jeevambu Bempan Marthyaali Bhayamu Deerpan – Maranambu Geliche Gaana ||Kreesthe|| Paramandu Divijulaina – Dharayandu Manujulaina Prathi Naaluka Mokaalu – Prabhune Bhajinchu Gaana ||Kreesthe|| Ee Naamamunaku Minchu – Naamambu Ledatanchu Yehovaa Thandri Yesun – Hechchinchinaadu Gaana ||Kreesthe||