క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా - YouWorship
Kreesthesu Prabhuni Vishvaasulamugaa
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా - కడముట్టించెదము ఈ జీవితయాత్ర (2) తానుండు చోటనే మనముండెదము (2) ఇదియే మన మహిమ నిరీక్షణ (2) 1. తానే మార్గం, సత్యం జీవమును - తన ద్వారానే పరదైసును చేరెదము (2) పరమునకు వెళ్లినాడు మన స్థలము సిద్ధపరచ రానైయున్నాడు మరల మనల కొనిపోవుటకు (2) 2. విడువడు మనల అనాథలనుగ నెప్పుడు - మనలో ఉండి మనతో నివసించును పాటింతుము ఆజ్ఞలు ప్రేమింతుము తండ్రిని ప్రభువును ఎదుర్కొన సిద్ధముగా నుండెదం 3. ప్రభురాకడ సమయం సమీపించుచున్నది ప్రొద్దుగ్రుంకు వేళనో అర్థరాత్రి వేళనో తెల్లవారు జామునో ఎరుగరు ఎవ్వరు జాగురుకులమైయుండి మేల్కోని ప్రార్థింతుము 4. ప్రభువేతెంచును ప్రభావముతో మహిమతో మేఘారూఢుడై వచ్చుట చూచెదము తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అనుగ్రహించును నీతికీరీటము 5. ఎంత గొప్ప భాగ్యము ఆ పరమ నివాసము- నిత్యమైన మహిమలో దైవ సహవాసము వెలలేని క్రయమిచ్చి వారసులుగా జేసితివి చెల్లింతుము ప్రభు కృతజ్ఞతాస్తోత్రములు Pallavi: Kreesthesu Prabhuni Vishvaasulamugaa - Kadamuttinchedamu Ee Jeevithayaathra (2) Thaanundu Chotane Manamundedamu (2) Idiye Mana Mahima Nireekshana (2) 1. Thaane Maargan, Sathyan Jeevamunu - Thana Dvaaraane Paradaisunu Cheredamu (2) Paramunaku Vellinaadu Mana Sthalamu Siddhaparacha Raanaiyunnaadu Marala Manala Konipovutaku (2) 2. Viduvadu Manala Anaathalanuga Neppudu - Manalo Undi Manatho Nivasinchunu Paatinthumu Aagnalu Preminthumu Thandrini Prabhuvunu Edurkona Siddhamugaa Nundedan 3. Prabhuraakada Samayan Sameepinchuchunnadi Proddugrungku Velano Artharaathri Velano Thellavaaru Jaamuno Erugaru Evvaru Jaagurukulamaiyundi Melkoni Praarthinthumu 4. Prabhuvethenchunu Prabhaavamutho Mahimatho Meghaaroodhudai Vachchuta Choochedamu Thana Prathyakshatha Apekshinchu Vaariki Anugrahinchunu Neethikeereetamu 5. Entha Goppa Bhaagyamu Aa Parama Nivaasamu- Nithyamaina Mahimalo Daiva Sahavaasamu Velaleni Krayamichchi Vaarasulugaa Jesithivi Chellinthumu Prabhu KruthagnathaSthothramulu