క్రీస్తు పుట్టెను హల్లెలూయా - YouWorship
Kreesthu Puttenu Hallelooyaa
Artist: జ్యోతి రాజు
Category: Christmas
Song Lyrics
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత|| గెరాసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత|| మరణమాయె యాయీరు కూతురు వేదన రోదన కన్నీటిలో యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత|| వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీ కొరకై ఉదయించెను లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను|| Kreesthu Puttenu Hallelooyaa (2) Jagamanthaa Pandugaayenu – Sarvalokaaniki Sandadaayenu (2) Cheeku Chintha Veedipoye – Cheekatantha Tholagipoye (2) Navya Kaanthulegase Ilalo – Divyakaanthudesu Raakatho… Ullaasame Uthsaahame – Jagamanthaa Jayothsaahame (2) Chettekkina Lanchagondi Jakkayya Paapa Shaapamutho Nindiyundagaa Yesu Adugu Pettenu Aa Intilo – Rakshana Kaanthule Virajillenu (2) ||Cheeku Chintha|| Geraasenu Janamulalo Kondaru Rogaalu Dayyaalatho Baadhanondagaa Yesu Adugu Pettenu Aa Oorilo – Vidudala Kaanthule Prakaashinchenu (2) ||Cheeku Chintha|| Maranamaaye Yaayeeru Koothuru Vedana Rodana Kanneetilo Yesu Adugu Pettenu Aa Intilo – Jeevapu Kaanthule Prajwalillenu (2) ||Cheeku Chintha|| Vedanatho Naligipovuchunnaavaa Yesu Nee Korakai Udayinchenu Lemmu Thejarillumu Nee Intiki – Velugu Vachchiyunnadi (2) ||Kreesthu Puttenu||