క్రీస్తుయేసుకు మంగళం - YouWorship
Kreesthuyesuku Mangalam
Artist: సి. రవివర్మ
Category: Praise & Worship
Song Lyrics
క్రీస్తుయేసుకు మంగళం మా - కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును - కూడి పాడుదు మంగళం 1. ప్రవచనంబులు బల్మినట్టి - ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల - సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తు|| 2. జగమునేలెడు జీవనాధుడ - జపములందెడు కృపకటాక్ష అగణితంబగు ప్రేమజూపిన - అమరతేజుడ మంగళం ||క్రీస్తు|| 3. ఖిలులు బ్రోచెడు కనికరాత్మ - కేంద్ర స్థానము నీ హృదయంబు కలుషమును కడమార్చినట్టి - సిలువ నాధుడ మంగళం ||క్రీస్తు|| 4. మనము గోరెడు మా హృదీశుడ - మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల - ఆది దేవుడ మంగళం ||క్రీస్తు|| 5. జనకసుత శుద్ధాత్మ దేవుడ - గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యా - ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు|| Kreesthuyesuku Mangalam Maa - Keerthi Raajuku Mangalam Kreesthuyese Daivamanchunu - Koodi Paadudu Mangalam 1. Pravachanambulu Balminatti - Praananaadhudaveeve Needu Sthavamu Jeyuchu Melagu Manujula - Sathprabhuvukide Mangalam ||Kreesthu|| 2. Jagamuneledu Jeevanaadhuda - Japamulandedu Krupakataaksha Aganithambagu Premajoopina - Amarathejuda Mangalam ||Kreesthu|| 3. Khilulu Brochedu Kanikaraathma - Kendra Sthaanamu Nee Hrudayambu Kalushamunu Kadamaarchinatti - Siluva Naadhuda Mangalam ||Kreesthu|| 4. Manamu Goredu Maa Hrudeeshuda - Maargadarshuda Veevegaava Anayamu Ninugolchu Janamula - Aadi Devuda Mangalam ||Kreesthu|| 5. Janakasutha Shuddhaathma Devuda - Ganani Vinani Prema Poornuda Thanivitheeraga Paadudamu Yaa - Dhaathri Neekagu Mangalam ||Kreesthu||