క్రీస్తుని స్వరము విందును - YouWorship
Kreesthuni Swaramu Vindunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2) యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2) మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని|| బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2) దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని|| అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2) ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని|| ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2) ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని|| నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2) ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని|| నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2) అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని|| నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2) కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని|| తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2) భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని|| మరణాంధకార లోయలో నేనుండ (2) నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని|| ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2) దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని|| Kreesthuni Swaramu Vindunu Prabhuve Palikinappudu Madhura Swarameyadi Mellani Swarameyadi – (2) Yehovaa Nee Swaramu Jalamulapai Vinabadenu (2) Mahimagala Devudu Urumu Vale Garjinchenu (2) ||Kreesthuni|| Balamaina Nee Swaramu Bahu Prabhavamu Galadi (2) Devadaarula Virachunu Prajvalimpa Cheyunagnini (2) ||Kreesthuni|| Adbhuta Prabhu Swaramu Aranyamu Kadilinchunu (2) Aakula Raalajeyunu Lella Neenajeyunu (2) ||Kreesthuni|| Aalayamandanniyu Aayanane Ghanaparachun (2) Aasheervaadamu Shaanthi Nosagu Naayana Swarame (2) ||Kreesthuni|| Nee Madhura Swaramu Nee Vaakyamunu Vindun (2) Praarthanalayanduna Prathidinamu Palkedavu (2) ||Kreesthuni|| Nee Madhura Swaramu Nee Chitthamu Thelpunu (2) Anudina Jeevithamulo Anusarincheda Ninnu (2) ||Kreesthuni|| Nee Madhura Swaramu Nee Maargamu Joopunu (2) Kudi Yedamala Thirigina Nee Swarame Vinabadunu (2) ||Kreesthuni|| Thuphaanulu Kaligi Bhayabheethulalo Nunda (2) Bhayapadakumani Palike Premagala Nee Swaramu (2) ||Kreesthuni|| Maranaandhakaara Loyalo Nenunda (2) Neeku Thodaiyuntinanedi Swaramunu Vintin (2) ||Kreesthuni|| Prabhuvaa Selavimmu Nee Daasudalinchun (2) Deenudanai Nee Maata Angeekarinchedanu (2) ||Kreesthuni||