క్రీస్తునాయక నీ దయాళిని - YouWorship
Kreesthunaayaka Nee Dayaalini
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
క్రీస్తునాయక నీ దయాళిని - కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోయ దండ్రి దేవుని - నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు|| 1. సిలువ మోసిన నీ ప్రయాసను - జెప్పుటకు నోరాడదు అలుకునొందక స్వామి నీ దివ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు|| 2. నిమిషమైన న్నాయకెదలో - నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవాను క్రోశము - హర్షముగ వర్ణింతును ||క్రీస్తు|| 3. యేసుప్రభు నా కాలమంతయు - నేమరక నీ నామము దాసునిగ భజియింతు నింకను - దప్పకుండను నీమము ||క్రీస్తు|| 4. చచ్చి నే నరుదెంచి మోక్షము - స్వామి నీ యుపకారముల్ హెచ్చు ప్రేమను బాడుచుందును - యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు|| 5. మలినమౌ నా నత్తి నాల్క సమాధిలోం గ్రశియింపను బలిమితోనే బాడుచుందును - భక్తి యుజ్వలింపను ||క్రీస్తు|| 6. కన్ను మూతలుగాను నీ సముఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు శ్రీకర - దేవ నను నీవేలను ||క్రీస్తు|| 7. ముగ్గురొకండై వెల్లుచుండెడి - మోక్షరాజ్య గరిష్టుండా యొగ్గుచేయక నన్ను బ్రోవవే - యేసునాధ మహేశుండా ||క్రీస్తు|| 8. భూతలములో నీ సమానము - బోల్చ నేదియు గానము సలుపవే మము నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు|| Kreesthunaayaka Nee Dayaalini - Keerthanalugaa Baadudun Nesthuthulathoya Dandri Devuni - Nithyamunu Gondaadudun ||Kreesthu|| 1. Siluva Mosina Nee Prayaasanu - Jepputaku Noraadadu Alukunondaka Svaami Nee Divyaanghri Chenthanu Goodudu ||Kreesthu|| 2. Nimishamaina Nnaayakedalo - Ninnu Ne Smariyinthunu Amithamau Devaanu Kroshamu - Harshamuga Varninthunu ||Kreesthu|| 3. Yesuprabhu Naa Kaalamanthayu - Nemaraka Nee Naamamu Daasuniga Bhajiyinthu Ninkanu - Dappakundanu Neemamu ||Kreesthu|| 4. Chachchi Ne Narudenchi Mokshamu - Svaami Nee Yupakaaramul Hechchu Premanu Baaduchundunu - Yeppudunu Gaivaaramul ||Kreesthu|| 5. Malinamau Naa Naththi Naalka Samaadhilom Grashiyimpanu Balimithone Baaduchundunu - Bhakthi Yujvalimpanu ||Kreesthu|| 6. Kannu Moothalugaanu Nee Samukhambu Kenu Biraalanu Thennu Thappakavaththu Shreekara - Deva Nanu Neevelanu ||Kreesthu|| 7. Muggurokandai Velluchundedi - Moksharaajya Garishtundaa Yoggucheyaka Nannu Brovave - Yesunaadha Maheshundaa ||Kreesthu|| 8. Bhoothalamulo Nee Samaanamu - Bolcha Nediyu Gaanamu Salupave Mamu Nee Thandrikini Sandhaanamu ||Kreesthu||