కోటి కాంతుల వెలుగులతో - YouWorship
Koti Kaanthula Velugulatho
Artist: బాపు కొండేటి
Category: Christmas
Song Lyrics
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల|| రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) ||కోటి కాంతుల|| మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2) ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) ||కోటి కాంతుల|| Koti Kaanthula Velugulatho Udayinchenu Oka Kiranam Lokamanduna Prathi Hrudayam Chigurinchenu Ee Tharunam Divini Vidichi Bhuvini Manakai Maanavunigaa Janminchenu Digulu Chendaka Gathamu Marachi Yesuni Aaraadhinthumu Lokaanike Idi Parvadinam Mahadaanandame Prathi Kshanam – (2) ||Koti|| Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve Thaanugaa Manujulaku Maadiri Thaanai Undutake Ila Ethenchegaa (2) Manakosame Janminchenu Thana Premane Panchenu Aa Varamune Thanu Vidachenu Nararoopigaa Velasenu Srushtike Moolaadhaaramaina Devude Ila Digi Vachchenaa Shodhanaa Baadhalu Enni Unnaa Netitho Ika Dari Cherunaa Aanandame Ika Santhoshame Prathivaaniki Shubha Parinaamame – (2) ||Koti|| Mahimagala Mahimonnathudu Pashuvula Shaalalo Pasivaanigaa Karunagala Kaaranajanmudu Shishuvugaa Manalo Okavaanigaa (2) Enaatiki Mana Thodugaa Undaalani Andagaa Prathivaaniki Snehithunigaa Hrudayaana Janminchegaa Andhakaarapu Ee Lokamandu Deva Devudu Udayinchegaa Ennadu Leni Vevela Kaanthulu Lokamandunaa Pavalinchegaa Santhoshame Samaadhaaname Idi Devaadi Devuni Bahumaaname – (2) ||Koti||