కొనియాడ తరమే నిన్ను - YouWorship
Koniyaada Tharame Ninnu
Artist: పంతగాని పరదేశి
Category: Praise
Song Lyrics
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2) శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ|| Koniyaada Tharame Ninnu Komala Hrudaya – Koniyaada Tharame Ninnu Thanaraaru Dinakaru – Benu Thaaralanu Minchu (2) Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu ||Koniyaada|| Kherubulu Serupulu – Mari Dootha Ganamulu (2) Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu ||Koniyaada|| Sarva Lokambula – Barvu Devuda Vayyu (2) Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu ||Koniyaada|| Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2) Pashvaalitho Dotti – Pandiyuntivi Veevu ||Koniyaada|| Dosambulanu Madiyu – Daasaali Karuninchi (2) Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu ||Koniyaada|| Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2) Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu ||Koniyaada|| O Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2) Shreyamuga Pavalinchu – Shreekara Varasutha ||Koniyaada||