కొండల తట్టు నా కన్నులు - YouWorship
Kondala Thattu Naa Kannulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2) నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా|| Kondala Thattu Naa Kannulu Etthuchunnaanu (2) Naaku Sahaayam Ekkada Nundi Vacchunu (2) Yehovaa Valane – Yehovaa Valane Naaku Sahaayam Kalugunu – Kalugunu (2) Kalugunu Bhoomyaakaashambulanu – Srujiyinchina Devaa Naa Paadambulanu – Thotrillaneeyadu (2) Nanu Kaapaaduvaadu Kunukadu – Nidurapodennadu (2) Yehovaa Nanu Preminchi – Kaapaadi Rakshinchunu (2) ||Yehovaa|| Naa Kudi Prakka Needagaa – Yehovaa Undunu Pagati Enda Raathri Vennela – Debbaina Thagalaka (2) Ae Apaayamu Naaku Raakundaa – Yehovaa Kaapaadunu (2) Naa Raakapokalayandunu – Kaapaadi Rakshinchunu (2) ||Yehovaa|| Vetakaani Urilo Nundi – Vidipinchina Devaa Naashanakaramaina Thegulu Raakunda – Rakshinchina Devaa (2) Nee Balamaina Rekkalatho Kappumayaa – Maa Rakshana Aadhaaramaa (2) Naa Kudi Prakka Padi Velu Koolinanu – Nee Krupa Chetha Kaapaadumaa (2) ||Yehovaa||