కృప కృప నా యేసు కృపా - YouWorship
Krupa Krupa Naa Yesu Krupaa
Artist: అనిల్ కుమార్
Category: Praise
Song Lyrics
కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో|| Krupa Krupa Naa Yesu Krupaa Krupa Krupa Krupaa (2) Nee Koraku Nannu Mundugaane Nirnayinchithive Neevu Nannu Pilichi Nee Neethinichchi Mahimaparachithive Nenemaiyuntino Anduku Kaadayyaa Naa Kriyalanu Batti Asale Kaadayyaa Choopaavu Prema Naapai Pilichaavu Nannu Krupakai Janamulaku Pravakthagaa Nanu Niyaminchaavayyaa Naapai Nuvvu Choopina Prema Entho Goppadayyaa Kalalonainaa Ninnu Maruvanelenayyaa Ruchi Choochi Erigaa Ninnu Naa Yesayyaa Nee Krupa Naa Jeevamukante Uththamamainadayyaa Nee Prema Dhwajame Paikeththi Naapai – Nannaakarshinchaavayyaa Nuvvuleni Nannu Oohinchalenu – Naa Shirassu Neevayyaa Naa Gurthimpanthaa Neeve Yesayyaa Naa Paapamu Nanu Tharumangaa Neelo Daachithive Ne Neeku Shiksha Vidhinchanu Shaalom Antive Naa Nerapu Maranapu Shikshanu Neevu Bharinchithive Ikapai Paapamu Cheyakani Maargamu Choopithive Nee Manchithaname Kaliginche Naalo – Maaru Manassesayyaa Nenenthagaano Kshamiyinchabadithini – Ekkuvagaa Preminchithivayyaa Naa Modati Prema Neeve Yesayyaa Pairoopamu Lakshyamu Chese Narudavu Kaadayyaa Naa Hrudayapu Lothunu Erigina Devudu Neevayyaa Nanu Neeve Korukoni Naa Sthithi Maarchaavayyaa Nee Prajalanu Nadipimpa Abhishekinchaavayyaa Emundi Naalo Neevinthagaa Nanu – Hechchinchutaku Yesayyaa Emivvagalanu Nee Goppa Krupakai – Virigina Naa Manassenayyaa Nee Korake Nenu Jeevisthaanayyaa Padivela Mandilo Neevu Athi Sundarudavayyaa Athi Kaankshaneeyudavu Naa Priyudavu Neevayyaa Neekante Nanu Preminche Premikudevarayyaa Vidanaadani Snehithudaa Naa Manchi Yesayyaa Neelona Nenu Naalona Neevu – Ekaathma Aithimayyaa Jeevinchuvaadanu Ika Nenu Kaanu – Naa Yandu Neevayyaa Nee Manase Naa Darshanamesayyaa