కృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా - YouWorship
Krupasinhaasanundaa Alphaa Omegaa Neevegaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: కృపాసింహాసనుండా (1)- అల్ఫా ఓమేగా నీవేగా (1) కృపాసింహాసనుండా - కృపా దాపునజేరి నుతించెద (2) 1. ఇదిగో సమస్తమును - నూతనముగ చేయుచున్నాను (2) ఇదిగో సమస్తమును (1) - మోదంబు గలుగజేసెద (2) 2. దైవవాక్యము గైకొని - జీవించిజయించువాని దైవవాక్యము గైకొని - దేవాలయ స్తంభముగా జేతున్ 3. దావీదు తాళము గలిగి - నా దేవుని పేరు వ్రాసెద దావీదు తాళము గలిగి - దావీదు జీవింపజేతున్ నెపుడచట 4. సత్యస్వరూపిని నా - క్రొత్త పేరు వాని పై వ్రాతున్ సత్యస్వరూపిని నా - సత్యమునందు నడిపింతున్ 5. పరలోకమును దిగివచ్చు - పరిశుద్ధ పట్టాణము పేరు పరలోకమును దిగివచ్చు - మురియుచు వానిపై వ్రాతున్ 6. ఉత్తముడు యెహోవా - క్రొత్తగీతము పాడుడి ఉత్తముడు యెహోవా - పుత్రుడేసుని మన కొసగెన్ 7. తండ్రికి ప్రియుడేసు - అండగ నుండెను తండ్రి తండ్రికి ప్రియుడేసు - మెండుగ నాత్మతో నిండెన్ 8. సిలువపై ప్రాణమిడెను - విలువ సమాధి నుంచబడె సిలువపై ప్రాణమిడెను - గెలిచి లేచె సజీవుండై 9. ఘనుడైన ప్రియుడేసు - దీనుల యాదరించును ఘనుడైన ప్రియుడేసు - వినయముతో మనలను పిలిచెన్ 10. ఉల్లంబులు రంజిల్లె - ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ ఉల్లంబులు రంజిల్లె - హల్లెలూయ పాడెదము Pallavi: Krupasinhaasanundaa (1)- Alphaa Omegaa Neevegaa (1) Krupasinhaasanundaa - Krupa Daapunajeri Nuthincheda (2) 1. Idigo Samasthamunu - Noothanamuga Cheyuchunnaanu (2) Idigo Samasthamunu (1) - Modambu Galugajeseda (2) 2. Daivavaakyamu Gaikoni - Jeevinchijayinchuvaani Daivavaakyamu Gaikoni - Devaalaya Sthambhamugaa Jethun 3. Daaveedu Thaalamu Galigi - Naa Devuni Peru Vraaseda Daaveedu Thaalamu Galigi - Daaveedu Jeevimpajethun Nepudachata 4. Sathyasvaroopini Naa - Kroththa Peru Vaani Pai Vraathun Sathyasvaroopini Naa - Sathyamunandu Nadipinthun 5. Paralokamunu Digivachchu - Parishuddha Pattaanamu Peru Paralokamunu Digivachchu - Muriyuchu Vaanipai Vraathun 6. Uththamudu Yehovaa - Kroththageethamu Paadudi Uththamudu Yehovaa - Puthrudesuni Mana Kosagen 7. Thandriki Priyudesu - Andaga Nundenu Thandri Thandriki Priyudesu - Menduga Naathmatho Ninden 8. Siluvapai Praanamidenu - Viluva Samaadhi Nunchabade Siluvapai Praanamidenu - Gelichi Leche Sajeevundai 9. Ghanudaina Priyudesu - Deenula Yaadarinchunu Ghanudaina Priyudesu - Vinayamutho Manalanu Pilichen 10. Ullambulu Ranjille - Ellappudu Prabhu Manatho Nunda Ullambulu Ranjille - Hallelooya Paadedamu