కృపగల దేవా - YouWorship
Krupagala Devaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
కృపగల దేవా దయగల రాజా కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల|| త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే (2) జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల|| కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే (2) బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల|| నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ (2) ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల|| Krupagala Devaa Dayagala Raajaa Krupagala Devaa Dayagala Raajaa Cherithi Ninne Bahu Ghanathegaa Nee Charanamule Ne Korithini Nee Varamulane Ne Vedithini (2) Sarvaadhikaari Neeve Devaa – Naa Sahakaari Neeve Prabhuvaa Naa Korikale Saphalamu Chesi – Aalochanale Neraverchithivi Arpinchedanu Naa Sarvamunu Neeke Devaa Aaraadhinchi Aanandincheda Neelo Devaa (2) ||Krupagala|| Throvanu Choope Thaaravu Neeve Gamyamu Cherche Saarathi Neeve (2) Jeevana Yaathraa Shubhapradamaaye Naa Prathi Praardana Parimalamaaye Nee Udayakaanthilo Nanu Nadupumu Naa Hrudini Nee Shaanthitho Nimpumu (2) ||Krupagala|| Krupa Choopi Nannu Abhishekinchi Vaagdhaanamulu Neraverchinaave (2) Bahu Vinthagaa Nanu Preminchinaave Balamaina Janamuga Nanu Maarchinaave Nee Keerthi Jagamantha Vivarinthunu Nee Divya Mahimalanu Prakatinthunu (2) ||Krupagala|| Naa Yesuraajaa Varudaina Devaa Meghaala Meeda Digi Vachchu Vela (2) Aakaasha Veedhilo Kamaneeya Kaanthilo Priyamaina Sanghamai Ninu Cheredanu Nilichedanu Neethone Seeyonulo Jeevinthu Neelone Yugayugamulu (2) ||Krupagala||