కూడికొని యున్నాము - YouWorship
Koodikoni Yunnaamu
Artist: పులిపాక జగన్నాధము
Category: Worship
Song Lyrics
కూడికొని యున్నాము - సంఘ ప్రభో - కూడికొని యున్నాము = తోడ నుండెద ననుచు నమ్ముచు - దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని|| 1. ఎచట నా ప్రియ భక్తు - లెలమి గూడియున్న నచటికి నేనెంతు - నని పల్కితి = విచట నుండు మమ్ము - వీక్షించి కృపచేత - నిపుడు దీవించు మా - యేసు క్రీస్తునాధా ||కూడికొని|| 2. గత కాలమందున - గాని చేతలచే దు - ర్గతి నొంది యుండగా - గనుగొంటివి = శత సంఖ్య గల పాప - చయ మీవు క్షమియించి - యతి శాంతి నిడితివి - యాత్మస్వరూపా ||కూడికొని|| 3. నిరతము నీ ప్రేమ - నెనరున ధ్యానించి - పరమ ధర్మములందు - బరత గల్గి = యరులకు శుభములు - నిరతంబు చేయగ - దిరత మా కొసగు ము - దేవుని ప్రియ తనయా ||కూడికొని|| 4. అన్ని శోధనముల - నన్ని విపత్తుల - నన్ని కాలములందు - నాదరించి నిన్ను నమ్మిన జనుల - నీ సందిటను జేర్చి - పన్నుగ గాపాడు - ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని|| 5. అమలుండ నగు న - న్ననుకరించుం డనుచు - నాన నిచ్చినాడ - వాత్మ జలకూ = నమల మార్గము నందు - నరుగంగ మాకీవు - విమలాత్మ దయ సేయు - వేగంబు మా తండ్రి ||కూడికొని|| Koodikoni Yunnaamu - Sangha Prabho - Koodikoni Yunnaamu = Thoda Nundeda Nanuchu Nammuchu - Dodda Dagu Nee Paada Sannidhi ||Koodikoni|| 1. Echata Naa Priya Bhakthu - Lelami Goodiyunna Nachatiki Nenenthu - Nani Palkithi = Vichata Nundu Mammu - Veekshinchi Krupachetha - Nipudu Deevinchu Maa - Yesu Kreesthunaadhaa ||Koodikoni|| 2. Gatha Kaalamanduna - Gaani Chethalache Du - Rgathi Nondi Yundagaa - Ganugontivi = Shatha Sankhya Gala Paapa - Chaya Meevu Kshamiyinchi - Yathi Shaanthi Nidithivi - Yaathmasvaroopaa ||Koodikoni|| 3. Nirathamu Nee Prema - Nenaruna Dhyaaninchi - Parama Dharmamulandu - Baratha Galgi = Yarulaku Shubhamulu - Nirathambu Cheyaga - Diratha Maa Kosagu Mu - Devuni Priya Thanayaa ||Koodikoni|| 4. Anni Shodhanamula - Nanni Vipaththula - Nanni Kaalamulandu - Naadarinchi Ninnu Nammina Janula - Nee Sanditanu Jerchi - Pannuga Gaapaadu - Prabhu Yesu Kreesthu ||Koodikoni|| 5. Amalunda Nagu Na - Nnanukarinchun Danuchu - Naana Nichchinaada - Vaathma Jalakoo = Namala Maargamu Nandu - Naruganga Maakeevu - Vimalaathma Daya Seyu - Vegambu Maa Thandri ||Koodikoni||