కుమారి ఆలకించు నీ వాలోచించి కుమారి చెవియొగ్గుము 2 - YouWorship
Kumaari Aalakinchu Nee Vaalochinchi Kumaari Cheviyoggumu 2
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: కుమారి ఆలకించు - నీ వాలోచించి - కుమారి చెవియొగ్గుము (2) అను పల్లవి: మరువుము నీదు స్వంత జనమును (2) మరువుము నీదు తండ్రి యింటిని (2) || కుమారి || 1. ఈ రాజు నీ ప్రభువు (1)- నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు (2) ఈ రాజు నీదు సౌందర్యమును గోరె (2) ఈ రాజునకు నమస్కరించుము (2) 2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు 3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి 4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది 5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు 6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు 7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు కాన జనములు సర్వకాలము - కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు Pallavi: Kumaari Aalakinchu - Nee Vaalochinchi - Kumaari Cheviyoggumu (2) Anu Pallavi: Maruvumu Needu Svantha Janamunu (2) Maruvumu Needu Thandri Yintini (2) || Kumaari || 1. Ee Raaju Nee Prabhuvu (1)- Nee Sogasu Gore Ee Raaju Nee Prabhuvu (2) Ee Raaju Needu Saundaryamunu Gore (2) Ee Raajunaku Namaskarinchumu (2) 2. Thooru Desha Kumaarthe - Naivedyamulanu Theesikoni Vachchunu Prajalalo Ishvaryavanthulu - Kumaari Nee Dayanu Vedakedaru 3. Anthahpuramulo Nundu Raajakumaarthe - Entho Mahima Galadi Shrunggaaramainatti Aame Vasthramulu - Banggaarubuttaa Panichesinavi 4. Vichithra Panigala Vasthramula Dharinchi - Vichithra Panigala Raaju Noddhaku Kanyakala Valana - Ramyamugaa Koni Raabaduchunnadi 5. Uthsaaha Santhoshamutho - Vaaru Vachchu Chunnaaru - Uthsaaha Santhoshamutho Raajanagarilo Praveshinchu Chunnaaru - Raabadu Chunnaaru Kanyalandaru 6. Nee Thandrulaku Prathigaa - Nee Kumaarulunduru - Nee Thandrulaku Prathigaa Ee Dharani Yandanthata Neevu Vaarini - Adhikaarulanugaa Niyaminchedavu 7. Tharamu Lannitanu Nee - Peru Gnaapakamundu - Karani Nonarchedavu Kaana Janamulu Sarvakaalamu - Kruthagnathasthuthulu Neeku Chellinthuru