కావలెనా యేసయ్య - YouWorship
Kaavalenaa Yesayya
Artist: వినయ్
Category: Correction
Song Lyrics
కావలెనా యేసయ్య బహుమానము (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా|| నీనెవె పట్టణము యెహోవా దృష్టికి ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి నీనెవెకు పంపెను – కనికరము చూపించెను ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా ఆగింది యెహోవా శాపము కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా|| దేవుని ప్రజలను నశియింప చేయుటకు దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా అణిగింది హామాను గర్వము జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా|| Kaavalenaa Yesayya Bahumaanamu (Mari) Cheyaali Viluvaina Upavaasamu (2) Siddhamou Shree Yesuni Priya Sanghamaa Chigurinchaali Anjoorapu Chettu Kommalaa (2) ||Kaavalenaa|| Neeneve Pattanamu Yehovaa Drushtiki Ghoramaayenu – Paapamutho Nindipoyenu Srushtikartha Yehovaa Yonaanu Darshinchi Neeneveku Pampenu – Kanikaramu Choopinchenu Ghanulemi Alpulemi – Neeneve Pattanapu Raajemi Pillalemi Peddalemi – Upavaasamu Cheyagaa Aagindi Yehovaa Shaapamu Kurisindi Karuna Varshamu (2) ||Kaavalenaa|| Devuni Prajalanu Nashiyimpa Cheyutaku Dushtudu Thalachenu – Kalavaramu Puttinchenu Mordekai Vedanatho Raajunoddaku Pamputa Daiva Chitthamani – Estherunu Siddhaparachenu Ghanulemi Alpulemi – Shooshanu Kotalo Raani Emi Pillalemi Peddalemi – Upavaasamu Cheyagaa Anigindi Haamaanu Garvamu Jarigindi Devuni Chitthamu (2) ||Kaavalenaa||