కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ - YouWorship
Kaalamu Sameepamu Prabhu Yesu Vachchun
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ (2) జీతము పొందును నిజ దాసుడు (2) - ఆనందమొందెదరు (4) 1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను (2) వెండి బంగారము విలువ రాళ్ళైనను (1) అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు (1) 2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబారని - కిరీట మొందెదవు 3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో ప్రభుని రాకలో అందరి యెదుట ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు 4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ ఆదర్శుండవై మందను కాచిన మహిమ కిరీటము - నీవు పొందెదవు 5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము - నీ కివ్వబడును 6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మికయుంచిన జీవకిరీటము - పొందెద వెరుగు 7. దయచేయు శ్రేష్ఠ దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు ప్రార్థన యందు మేల్కొని యుండుము - స్వర్ణకిరీటము ధరింపజేయును Pallavi: Kaalamu Sameepamu Prabhu Yesu Vachchun (2) Jeethamu Pondunu Nija Daasudu (2) - Aanandamondedaru (4) 1. Bayalupadu Prathivaani Kriyalu - Karragaddi Koyyakaalainanu (2) Vendi Banggaaramu Viluva Raallainanu (1) Agniye Thelpunu - (2) Appude Kanugonduvu (1) 2. Pandemandu Neeku Paalunnadaa - Ponduvaadokkade Bahumathini Yodhudavai Manchi Buddhini Kaligina Vaadabaarani - Kireeta Mondedavu 3. Aathmalakorakai Bhaaramunnadaa - Phalithamunnadaa Nee Sevalo Prabhuni Raakalo Andari Yeduta Aanandamahima - (2) Kireeta Mondedavu 4. Sangghamu Nadipe Sevakudaa - Mandanu Nadupumu Premathoda Aadarshundavai Mandanu Kaachina Mahima Kireetamu - Neevu Pondedavu 5. Manchi Poraatamu Poraadumu - Kaapaadukonu Vishvaasamunu Thana Prathyakshatha Napekshinchumu Neethi Kireetamu - Nee Kivvabadunu 6. Bhakthitho Brathuka Gorinacho - Siddhapadu Ponda Hinsalanu Anthamu Varaku Nammikayunchina Jeevakireetamu - Pondeda Verugu 7. Dayacheyu Shreshtha Deevenalu - Anggeekarinchu Nee Praarthanalu Praarthana Yandu Melkoni Yundumu - Svarnakireetamu Dharimpajeyunu