కాలం సమయం నాదేనంటూ - YouWorship
Kaalam Samayam Naadenantu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2) దేవుని ముందు నిలిచే రోజుంది తక్కెడ తూకం వేసే రోజుంది (2) జీవ గ్రంథం తెరిచే రోజుంది నీ జీవిత లెక్క చెప్పే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం|| ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2) గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా|| చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2) నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా|| సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2) అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా|| Kaalam Samayam Naadenantu Anukuntunnaavaa Roojulu Anni Naavenantu Jeevisthunnaavaa (2) Devuni Mundu Niliche Rojundi Thakkeda Thookam Vese Rojundi (2) Jeeva Grandham Theriche Rojundi Nee Jeevitha Lekka Cheppe Rojundi Aagavemayyaa Ee Maata Vinavayyaa Aagavemayyaa Nee Manassu Maarchukovayyaa (2) ||Kaalam|| Dhanamu Balamu Unnadani Virraveeguthunnaavaa Medalu Middelu Unnaayani Anukuntunnaavaa (2) Gujaraathunu Choodavayya Entha Ghoramo Okka Ghadiyalendaro Bikaarulayyaaru (2) ||Aagavemayyaa|| Choosaavaa Bhookampaalu Karuvulu Vipareethaalu Parishuddha Grandhamuloni Kadavari Kaalapu Soochanalu (2) Ninnati Varaku Koduva Ledani Anukunnaaru Okka Ghadiyalo Endaro Nashinchipoyaaru (2) ||Aagavemayyaa|| Siddhapadina Vaari Kosam Paralokapu Dwaaraalu Siddhapadani Vaariki Aa Narakapu Dwaaraalu (2) Agni Aaradu Purugu Chaavadu Nithyam Edupu Dukhaalu (2) ||Aagavemayyaa||