కవులకైనా సాధ్యమా - YouWorship
Kavulakainaa Saadhyamaa
Artist: జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా|| చెదరిన మనసులకూ శాంతి కృంగిన హృదికీ ఓదార్పు మృత్యు దేహముకూ జీవం పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా|| క్షణికమైన అనురాగాలు ఆవిరివంటి ఆప్యాయతలు అవసరాల అభిమానాలు నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం స్వార్ధపూరిత ఈ లోకంలో ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా|| Kavulakainaa Saadhyamaa Nee Krupanu Varninchadam Preyasikainaa Saadhyamaa Nee Premanu Andinchadam Neela Nirminchadam Raajukainaa Saadhyamaa Neela Varameeyadam (2) ||Kavulakainaa|| Chedarina Manasulakoo Shaanthi Krungina Hrudikee Odaarpu Mruthyu Dehamukoo Jeevam Balaheenulaku Aarogyam (2) Gaayapadina Nee Hasthamu Chese Adbhutha Kaaryaalu Mosapooritha Ee Lokamlo Ae Vaidyuniki Saadhyamu (2) ||Kavulakainaa|| Kshanikamaina Anuraagaalu Aavirivanti Aapyaayathalu Avasaraala Abhimaanaalu Nilachipoye Anubandhaalu (2)