కరుణించి తిరిగి సమకూర్చు - YouWorship
Karuninchi Thirigi Samakoorchu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2) క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2) దావీదు రాజు దీనుడై వేడ (2) అవనిలో బొందిన నష్టములన్నియు (2) దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి|| శత్రు సమూహపు కుతంత్రములతో (2) బొత్తిగా నేను నష్టపడితిని (2) మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి|| పసరు గొంగళి – చీడ పురుగులు (2) నాశనము చేసిన పంటను కూర్చుమా (2) యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి|| ప్రేమ సంతోషానందములను (2) ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2) ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| పాపపు విషముతో నా పాత్ర నిండెను (2) ప్రభు యేసుండను పిండిని కలుపుము (2) పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి|| ఆత్మీయ సోమరితనములో నుండి (2) ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2) ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| పాపము చేసి పడియున్న చోటున్ (2) ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2) కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి|| చేసిన పాపము కప్పుకొనక (2) విశ్వాసముతో ఒప్పుకొందున్ (2) సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి|| Karuninchi Thirigi Samakoorchu Prabhuvaa (2) Kshamaapana Ninnu Veduchunnaanu (2) Daaveedu Raaju Deenudai Veda (2) Avanilo Bondina Nashtamulanniyu (2) Devaa Neevu Samakoorchithive (2) ||Karuninchi|| Shathru Samoohapu Kuthanthramulatho (2) Botthiga Nenu Nashtapadithini (2) Mithrudesulo Samakoorchumu Thandri (2) ||Karuninchi|| Pasaru Gongali – Cheeda Purugulu (2) Naashanamu Chesina Pantanu Koorchumaa (2) Yesu Prabhoo Ninnu Veduchunnaanu (2) ||Karuninchi|| Prema Santoshaanandamulanu (2) Pradhaana Yaajakaa Pogottukontini (2) Prematho Neevu Samakoorchumaa (2) ||Karuninchi|| Paapapu Vishamutho Naa Paathra Nindenu (2) Prabhu Yesundanu Pindini Kalupumu (2) Paapa Maranamunu Tholaginchumaa (2) ||Karuninchi|| Aathmeeya Somarithanamulo Nundi (2) Aathma Nashtamula Nenniyo Bondithi (2) Aathma Devaa Neevu Samakoorchumaa (2) ||Karuninchi|| Paapamu Chesi Padiyunna Chotun (2) Praapuga Neevu Joopumo Prabhuvaa (2) Kopaginchaka Naapai Krupa Joopumaa(2) ||Karuninchi|| Chesina Paapamu Kappukonaka (2) Vishwaasamutho Oppukondun (2) Siluva Raktamutho Shuddhi Cheyumaa (2) ||Karuninchi||