కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ - YouWorship
Karunan Erparachithivi Sainyamula Yehova Nan
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యె...హోవ నన్ (1) పరిశుద్ధుడా క్రీస్తులో ఎరిగితివి (2) - కరుణన్ (1) 1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని (2) గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను (2) 2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి 3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను 4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల 5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్ నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు 6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో (2) సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ 7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే పలుసంఘముల నిల స్థాపించెన్ - ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో Pallavi: Karunan - Erparachithivi Sainyamula Ye...Hova Nan (1) Parishuddhadaa Kreesthulo Erigithivi (2) - Karunan (1) 1. Moshenu Korukoni - Chesithivi Naayakuni (2) Goshenu Nundi Ellan Nadupa - Osagithivi Yavasarathalanu (2) 2. Yaakobun Korukoni - Eshaavunu Vidichithivi Sakalambau Kashtamula Nosagi - Ishraayelanu Perunu Ichchithivi 3. Solamonun Korukoni - Ila Sakala Gnaanamide Aalaya Nirmaana Krupanidenu - Paalimpa Raajyambosagenu 4. Daaniyelunu Korukoni - Thana Paraloka Gnaanamide Ennenno Darshanamula Nosagi - Kanupaapaga Kaapaadenila 5. Jerubbaabelun Korukoni - Mudrayunggaramuga Jesen Nirminchenu Prabhuni Aalayamun - Virivaina Yirukula Yandu 6. Sthephenunu Korukoni - Nimpenu Thana Yaathmatho (2) Sampoornamagu Thana Saakshigaa - Pampenu Thana Hathahaakshuniga 7. Paulunu Korukonen - Sauluga Nunnayapude Palusangghamula Nila Sthaapinchen - Ella Melulaku Hallelooya Prabho