కన్నుల నిండుగ - YouWorship
Kannula Ninduga
Artist: అనిల్ వేముల
Category: Christmas
Song Lyrics
కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ గుండెల నిండుగ – ఆనందముండుగ (2) పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ మహిమలోనుండే – మహిమాత్ముండు మనుజుడాయెగా – మరణము నొందగా రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2) సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2) చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2) నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని ||రండి|| విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2) దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2) ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని ||రండి|| ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2) సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2) తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని ||రండి|| Kannula Ninduga – Christmas Panduga Gundela Ninduga – Aanandamunduga (2) Parama Purinunde – Parishuddha Devudu Pudamilo Puttegaa – Paapula Brovaga Mahimalo Nunde – Mahimaathmundu Manujudaayegaa – Maranamu Nondagaa Randi Cheri Kolichedam – Raarandi Kalai Paadudaam Randi Yesunanusarinchudaam – Padandi Prabhuni Choopinchudaam (2) Sarva Srushtini Maatatho Chesina – Saarvabhoumudaa Neeku Samudevvarayyaa Loka Paapamanthayu Moya Vachchina – Daiva Maanavaa Neeku Sthalame Ledayyaa (2) Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku (2) Nadipimpa Vachchina Najareyuni – Daatimpa Vachchina Dayaamayuni Preminchi Vacchina Premaamayuni – Kshamiyincha Vachchina Kshamaapoornuni ||Randi|| Vishwamanthayu Vyaapinchuyunna – Sarva Vyaapi Neevu Leni Chote Ledayyaa Antharangamanthayu Erigiyunna – Sarva Gnaani Neeku Saate Lerayyaa (2) Daasyamu Nundi Swaathanthryamunu – Shaapamu Nundi Vidudalanu (2) Prakatimpa Vachchina Punyaathmuni – Rakshimpa Vachchina Rakshakuni Shaanthi Cheya Vachchina Shaanthamoorthini – Vidipimpa Vachchina Vimochakuni ||Randi|| Oohakandani Thriyekamaiyunna – Advitheeyudaa Neeve Aathmaroopivayyaa Ninna Nedu Repu Ekareethigunna – Nithya Nivaasi Neeku Anthame Ledayyaa (2) Sankella Nundi Sambaraaniki – Ugratha Nundi Udaatthathaku (2) Thappimpa Vachchina Thyaagamoorthini – Kanikarimpa Vachchina Karunasheeluni Krupa Joopa Vachchina Krupaakaruni – Daapu Cheranichchina Daakshinya Poornuni ||Randi||