కన్నీళ్లతో పగిలిన గుండెతో - YouWorship
Kanneellatho Pagilina Gundetho
Artist: శామ్యూల్ కర్మోజి
Category: Encouraging
Song Lyrics
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు|| Kanneellatho Pagilina Gundetho Alasina Nesthamaa Manasunna Maaraajesuni Madilo Nilupumaa (2) Viduvadu Ninnu Edabaayadu Ninnu Kashtaala Kadalilo Gamyaanike Cherchunu (2) Viduvadu Ninnu Raathirantha Edupochchinaa – Kanta Neeru Aagakundinaa Kaalaminka Maarakundunaa – Velugu Neeku Kalagakundunaa Praanamichchi Prema Panchinaa – Peru Petti Ninnu Pilachinaa Nee Cheyi Patti Vidachunaa – Anaathagaa Ninnu Cheyunaa ||Viduvadu|| Andhakaaramaddu Vachchinaa – Sandramentha Eththu Lechinaa Niraashale Palakarinchinaa – Kreesthu Prema Ninnu Marachunaa Baadha Kalugu Deshamandunaa – Bandhakaalu Oodakundunaa Shathruventho Pagatho Ragalinaa – Ginne Nindi Porlakundunaa ||Viduvadu||