కనలేను ప్రభుకేల - YouWorship
Kanalenu Prabhukela
Artist: కే సుందర్ రావు
Category: Good Friday
Song Lyrics
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై మనలేను ప్రభు జూచి కఠినాత్మునై కఠినాత్మునై… ||కనలేను|| పాపులనేలేటి ప్రభునేలనో బల్లెంపు పోటుల బంధించిరి (2) కనుపించు పాపాలు రక్తాలలో ప్రభు బాధలో ||కనలేను|| ముండ్ల కిరీటము ప్రభుకేలనో మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2) ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా ||కనలేను|| తన జంపు శత్రువుల క్షమియించెను క్షమియింపుమని తండ్రిని వేడెను (2) క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను భరియించెను ||కనలేను|| మోయజాలని సిలువ మోయించిరి దివినేలు బాహువులు బంధించిరి (2) నా పాపమంతయు ప్రభు మోసెను భరియించెను ||కనలేను|| జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో చేదు చిరక త్రాగను అందించిరి (2) ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను సిలువొందెను ||కనలేను|| తన ఆత్మ తండ్రికి సమర్పించెను తనదంతా తండ్రితో చాచుంచెను (2) తలవంచి తండ్రిలో తుది చేరెను కను మూసెను ||కనలేను|| లోకాలనేలేటి ప్రభువేలనో ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2) నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో సిలువేసెనో ||కనలేను|| Kanalenu Prabhukela Shrama Silvapai Manalenu Prabhu Joochi Katinaathmunai Katinaathmunai… ||Kanalenu|| Paapulaneleti Prabhunelano Ballempu Potula Bandhinchiri (2) Kanupinchu Paapaalu Rakthaalalo Prabhu Baadhalo ||Kanalenu|| Mundla Kireetamu Prabhukelano Moodulu Mopiri Prabhu Netthini (2) Prabhu Raktha Gaayaalu Naa Paapamaa Prabhu Shaapamaa ||Kanalenu|| Thana Jampu Shathruvula Kshamiyinchenu Kshamiyimpumani Thandrini Vedenu (2) Kshamaa Buddhi Nerpinchi Chithi Norchenu Bhariyinchenu ||Kanalenu|| Moyajaalani Siluva Moyinchiri Divinelu Baahuvulu Bandhinchiri (2) Naa Paapamanthayu Prabhu Mosenu Bhariyinchenu ||Kanalenu|| Jeevajalamula Nichchu Prabhukelano Chedu Chiraka Thraaganu Andinchiri (2) Aathma Daahamu Theercha Bali Ayyenu Siluvondenu ||Kanalenu|| Thana Aathma Thandriki Samarpinchenu Thanadanthaa Thandritho Chaachunchenu (2) Thalavanchi Thandrilo Thudi Cherenu Kanu Moosenu ||Kanalenu|| Lokaalaneleti Prabhuvelano Ee Ghora Maranambu Guri Ayyeno (2) Naa Paapa Brathukela Prabhuvedcheno Siluveseno ||Kanalenu||