కంట నీరేల - YouWorship
Kanta Neerela
Artist: సాయారం గట్టు
Category: Encouraging
Song Lyrics
కంట నీరేల? కలతలు ఏల? యేసుతో నీవు సాగు వేళ శోధన వేళ రోదన ఏల? నీ విశ్వసము గెలిచే వేళ (2) నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| వలదు చింతన దేనికైనా విన్నవించుము నీ నివేదన (2) పొందితినను నీదు నమ్మకము దరికి చేర్చును తగిన విజయము (2) తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు బాధ కలదు (2) నీదు భారము మోయు ఆ దేవుడు నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట|| Kanta Neerela? Kalathalu Aela? Yesutho Neevu Saagu Vela Shodhana Vela Rodana Aela? Ne Vishwaasamu Geliche Vela (2) Nammina Aa Devudu – Ennadu Marachipodu Neeyokka Avasaraalu – Aenaado Thaanerigaadu ||Kanta|| Valadu Chinthana Denikainaa Vinnavinchumu Nee Nivedana (2) Pondithinanu Needu Nammakamu Dariki Cherchunu Thagina Vijayamu (2) Thirugannade Lenivi – Aa Thandri Deevenalu Porapaatu Eruganivi – Thaanichchu Aa Melulu (2) ||Kanta|| Repu Goorchina Bhayamu Valadu Prathi Dinamu Thagu Baadha Kaladu (2) Needu Bhaaramu Moyu Aa Devudu Neeku Mundugaa Naduchu Ellappudu (2) Neeloni Aa Bhayamu – Lokaaniki Prathiroopam Sthiramaina Nee Vishwaasam – Devuniki Santhosham (2) ||Kanta||