ఓ సంఘమా సర్వాంగమా - YouWorship
O Sanghamaa Sarvaangamaa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము (2) పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా|| చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2) ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా|| కడపటి బూర మ్రోగగానే - కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనుడవై - నడియాకాశము పోగలవా గొర్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా (2) రారాజును ఎదుర్కొనగలవా (2) ||ఓ సంఘమా|| O Sanghamaa Sarvaangamaa – Paraloka Raajyapu Prathibimbamaa Yesayyanu Edurkonaga – Neethi Nalankarinchi Siddhapadumaa O Sanghamaa Vinumaa Raani Ophiru Aparanjitho – Swarna Vivarna Vasthra Dhaaranatho Veena Vaayidya Tharangaalatho – Praaneshwaruni Prasannathatho Aananda Thaila Sugandhaabhishekamu (2) Pondithine Yesunandu (2) ||O Sanghamaa|| Kreesthe Ninnu Preminchenani – Thana Praana Marpinchenani Swasthaparache Nirdoshamugaa – Mudatha Kalankamu Lenidiga Mahimaa Yukthambugaa Niluva Gore Yesudu (2) Sahiyinthuvaa Theerpunaadu (2) ||O Sanghamaa|| Cheekatilo Nundi Velugunaku – Lokamulo Nundi Velupalaku Shreekara Gunaathishayamulanu – Prakatinchutake Pilachenani Gurthinchuchuntivaa Kriyalanu Gantivaa (2) Sajeevamugaa Nunnaavaa (2) ||O Sanghamaa|| Challaganaina Vechchaganu – Undina Neekadi Melagunu Nulivechchani Sthithi Neekundina – Bayataku Ummi Veyabadudhuvemo Nee Manasu Maarchuko Tholiprema Koorchuko (2) Aasakthitho Rakshana Pondumaa (2) ||O Sanghamaa|| Kadapati Boora Mrogagaane - Kanureppa Paatuna Maaruduvaa Vadigaa Meghaaseenudavai - Nadiyaakaashamu Pogalavaa Gorrepilla Sanghamaa Kreesthu Raaju Sanghamaa (2) Raaraajunu Edurkonagalavaa (2) ||O Sanghamaa||