ఓ యెహోవా నీవే నన్ను శోధించి యెరిగితివి - YouWorship
O Yehovaa Neeve Nannu Shodhinchi Yerigithivi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఓ యెహోవా నీవే నన్ను - శోధించి యెరిగితివి (2) 1. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును (2) నా తలంపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే (2) 2. నాదు నడక, నాదు పడక నీవే పరిశోధింతువు నా ప్రవర్తన యంతా నీకే సంపూర్ణముగా తెలియును 3. నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు యెడమ కుడిచేతులలో నన్ను భద్రపరతువు 4. నీదు యాత్మకు మరుగైయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్ యెక్కడికి వెళ్ళినను అక్కడున్నావు ప్రభూ 5. నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయమున్ Pallavi: O Yehovaa Neeve Nannu - Shodhinchi Yerigithivi (2) 1. Nenu Koorchunduta Niluchuta Neeku Baagugaa Theliyunu (2) Naa Thalampulu Neeku Thelisen Naalo Kalugaka Poorvame (2) 2. Naadu Nadaka, Naadu Padaka Neeve Parishodhinthuvu Naa Pravarthana Yanthaa Neeke Sampoornamugaa Theliyunu 3. Needu Chethin Naapai Nunchi Nannu Aavarinchithivi Needu Yedama Kudichethulalo Nannu Bhadraparathuvu 4. Needu Yaathmaku Marugaiyilalo Nechchatiki Ne Velledan Yekkadiki Vellinanu Akkadunnaavu Prabhoo 5. Naadu Antharanggamunu Naadu Aalochanalanu Neeve Parisheelinchi Naaku Nimmu Shuddha Hrudayamun