ఓ ప్రభువా యిది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగె - YouWorship
O Prabhuvaa Yidi Nee Krupaye Goppa Krayamu Dvaaraa Kalige
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె (2) 1. కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగె (2) అపరాధముల నుండి విమోచన (2) - యేసులో మనకు ప్రాప్తించె (2) 2. కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిల క్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే 3. కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారా అపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో 4. కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగ అపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ 5. కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించును అపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము 6. కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమును ప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము 7. కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమి క్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము Pallavi: O Prabhuvaa Yidi Nee Krupaye - Goppa Krayamu Dvaaraa Kalige (2) 1. Krupadvaaraane Paapakshamaapana - Rakthamu Dvaaraane Kalige (2) Aparaadhamula Nundi Vimochana (2) - Yesulo Manaku Praapthinche (2) 2. Krupadvaaraane Kaligina Rakshana - Maanavulosaga Jaalarila Kriyaladvaaraa Kalugaledu - Yesu Prabhuni Varamidiye 3. Krupatho Manala Pilichenu Prabhuvu - Parishudda Pilupudvaaraa Aparimitha Sangkalpamuvalana - Manamerigithimi Ee Dharalo 4. Krupadvaaraane Neethi Manthulugaa - Theerchenu Manala Uchithamuga Apaathrulamaiyunna Manaku - Praayashchiththamu Kaligenuga 5. Krupaye Manaku Bayalu Padenu - Samasthamunu Bhodhinchunu Apavithra Kriyalanniyu Vidachi - Bhayabhakthulatho Brathikedamu 6. Krupadvaaraane Balavanthulamai - Edurukonedamu Yuddhamunu Prabhuvunandu Antha Muvaraku - Sthiramuga Mundukusaagedamu 7. Krupadvaaraane Sameepinchithimi - Daaniyande Nilichithimi Kreesthu Mahima Nireekshanakai - Aayanake Sthuthi Paadedamu