ఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యము - YouWorship
O Prabhuvaa Nee Sevan Cheseda Nithyamu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - (2) నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - (2) 1. శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములు - పైబడుచునున్నవి బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము 2. బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తం - ప్రోక్షించు నాపైన నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము 3. లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములు - బెదిరించుచున్నవి ఆకాశము నుండి - ఆదరించుము నన్ను 4. బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం - దినదినము నేర్పించు నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా 5. మెల్లని నీ స్వరము - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్ - కొరకు చూపించు నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు 6. పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ - ప్రభునింపు నీ కొరకే పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు 7. క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము - క్రీస్తే నా ఆశ్రయము క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము Pallavi: O Prabhuvaa Nee Sevan - Cheseda Nithyamu - (2) Nee Maate Vineda - Naruni Maata Vinakundu - (2) 1. Shodhinchu Svaramulu - Vinabaduchununnavi Vedhinchu Neramulu - Paibaduchununnavi Bodhinchu Nee Maargan - Vinipinchu Nee Svaramu 2. Balamaina Shathruvu - Baadhinchuchunnaadu Viluvaina Nee Rakthan - Prokshinchu Naapaina Nee Hastha Balamutho - Jayamunu Naakimmu 3. Lokaashalu Nannu - Kadilinchuchunnavi Niraasha Samayamulu - Bedirinchuchunnavi Aakaashamu Nundi - Aadarinchumu Nannu 4. Bethelu Darshanamu - Spashtamugaa Choopinchu Penuyelu Poraatan - Dinadinamu Nerpinchu Naa Kaalamanthayu - Nanu Nadupu Naa Prabhuvaa 5. Mellani Nee Svaramu - Madhuramugaa Vinipinchu Thinnani Nee Throvan - Koraku Choopinchu Nee Velugulo Nannu - Nithyamu Nadipinchu 6. Parishodhinchumu Nannu - Parishuddha Vaakyamutho Parishuddhathma Chenan - Prabhunimpu Nee Korake Parishuddha Sangghamulo - Anggamugaa Dhroodhaparachu 7. Kreesthe Naa Gnaanamu - Kreesthe Naa Neethiyunu Kreesthe Naa Vijayamu - Kreesthe Naa Aashrayamu Kreesthe Naa Raaraaju - Kreesthe Naa Sarvamu