ఓ ప్రభుండా నిన్ - YouWorship
O Prabhumdaa Nin
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
1. I. ఓ ప్రభుండా నిన్ నుతించుచున్నాము వినయముతోడ II. మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||ఓ|| 2. I. నిత్యుండవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు II. సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ I. నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ|| 3. III. పరిశుద్ధ, పరిశుద్ధ - పరిశుద్ధ, సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నొప్పునటంచు ||ఓ|| 4. I. కెరూబుల్ సెరూపుల్ నిన్నుం గీర్తించుచున్నారు II. సారెకుజ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండున్ I. కూరిమి ప్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||ఓ|| 5. IV. మా మహా జనకా నిను మాన్యుండౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను ప్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ|| 6. V. నీవే క్రీస్తు రాజవు - నిత్య కుమారుండవు నీ విలలో మానవులను గావంగం బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దీవిన దెరచితివే ||ఓ|| 7. I. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుండవు II. నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము I. పావనంబౌ నీ రక్తంబున సేవకులకు దోడ్పడు మిపుడే ||ఓ|| 8. IV. నిత్య మహిమములో నింక నీదు భక్తులతో న గత్యముగ లెక్కించుము వారల గని రక్షించుమి నీ సుజనంబు ||ఓ|| 9. IV. నీవు దీవించి నీ నిత్య సొత్తైన సుజీవమిది వారలన్ బాలించి లేవంగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ|| 10. III. ఓ ప్రభువా పాపములో నుండ కుండంగ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మమున గరుణించుము దయతోడన్ ||ఓ|| 11. II. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకు ప్రేమ జూపు I. శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ|| 1. I. O Prabhumdaa Nin Nuthimchuchunnaamu Vinayamuthoda II. Maa Prabhumda Vamchu Ninnu Maanaka Memoppukomdu ||O|| 2. I. Nithyumdavau Thamdri Lokamu Ninnaaraadhimchuchu Numdu II. Sathyadoothal Mokshamamdu Sarva Pradhaanul Subhakthin I. Nithya Meka Kamthamuthoda Nin Goniyaaduchunnaaru ||O|| 3. III. Parishuddha, Parishuddha - Parishuddha, Senala Devaa Dharaparalokambulu Nee Vara Mahimatho Noppunatamchu ||O|| 4. I. Keroobul Seroopul Ninnum Geerthimchuchunnaaru II. Saarekuja Ninnaposthalula Samghamu Sthothrimchuchumdun I. Koorimi Pravakthala Samghamu Koniyaaduchu Nin Nuthiyimchu ||O|| 5. IV. Maa Mahaa Janakaa Ninu Maanyumdau Puthrun Bahu Premagala Maa Parishuddhaathmanu Preethitho Samghamu Bhuvi Noppukonun ||O|| 6. V. Neeve Kreesthu Raajavu - Nithya Kumaarumdavu Nee Vilalo Maanavulanu Gaavamgam Booninayapudu Paavana Kanyaa Garbhambuna Buttuta Bahudeenambanaka Chaavu Shrama Nodimchi Sajjanulaku Deevina Derachithive ||O|| 7. I. Neevu Devuni Kudi Paarshvambuna Nithyamu Mahimaaseenumdavu II. Neevu Maa Nyaayaadhipathivai Raavalayunani Nammuchumdumu I. Paavanambau Nee Rakthambuna Sevakulaku Dodpadu Mipude ||O|| 8. IV. Nithya Mahimamulo Nimka Needu Bhakthulatho Na Gathyamuga Lekkimchumu Vaarala Gani Rakshimchumi Nee Sujanambu ||O|| 9. IV. Neevu Deevimchi Nee Nithya Soththaina Sujeevamidi Vaaralan Baalimchi Levamga Neththumu Sathathamu Preethin ||O|| 10. III. O Prabhuvaa Paapamulo Numda Kumdamga Dodpadumu Maa Prabhuvaa Karunimchu Mamuna Garunimchumu Dayathodan ||O|| 11. II. O Prabhumdaa Ninnu Nammi Yunna Maaku Prema Joopu I. Shree Prabhumdaa Ninne Nammithi Siggunomda Neeyakumu ||O||