ఓ జగద్రక్షకా, విశ్వవిధాత - YouWorship
O Jagadrakshakaa, Vishvavidhaatha
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఓ జగద్రక్షకా, విశ్వవిధాత - రక్షణ నొసగితివి (2) సర్వకృపలకు దాతవు నీవే (2)- బలియైతివి మాకై (2) 1. కృపద్వారా రక్షణ మాకొసగె (2)- విశ్వాసము ద్వారానే (2) అపాత్రులమైనట్టి మాకు (2)- యిది నీ వరమేగా (2) 2. పాపములో మేము మరణించినప్పుడు - వచ్చితివి యిలకు ప్రభువా మేము నీ చెంతనుండ - జీవము నిచ్చితివి 3. పాపభారముచే పడిచెడియున్న - మమ్మును గాంచితివి కృప ద్వారానే మమ్మును పిలిచి - శాంతిని వొసగితివి 4. రక్షణ సందేశమును ప్రభువా - ప్రచురము చేసితివి రయముగ విశ్వసించిన మాకు - ఆత్మను వొసగితివి 5. మరుగైన వాటిని అజ్ఞానులకు - బయలుపరచితివి మర్మములను గ్రహియించుటకు - జ్ఞానము నొసగితివి 6. సేవను మాకు నిచ్చితివయ్యా - యుగయుగముల వరకు శక్తిమంతులమై నిను స్తుతియింప - విజయము నొసగితివి Pallavi: O Jagadrakshakaa, Vishvavidhaatha - Rakshana Nosagithivi (2) SarvaKrupalaku Daathavu Neeve (2)- Baliyaithivi Maakai (2) 1. Krupadvaaraa Rakshana Maakosage (2)- Vishvaasamu Dvaaraane (2) Apaathrulamainatti Maaku (2)- Yidi Nee Varamegaa (2) 2. Paapamulo Memu Maraninchinappudu - Vachchithivi Yilaku Prabhuvaa Memu Nee Chenthanunda - Jeevamu Nichchithivi 3. Paapabhaaramuche Padichediyunna - Mammunu Gaanchithivi Krupa Dvaaraane Mammunu Pilichi - Shaanthini Vosagithivi 4. Rakshana Sandeshamunu Prabhuvaa - Prachuramu Chesithivi Rayamuga Vishvasinchina Maaku - Aathmanu Vosagithivi 5. Marugaina Vaatini Agnaanulaku - Bayaluparachithivi Marmamulanu Grahiyinchutaku - Gnaanamu Nosagithivi 6. Sevanu Maaku Nichchithivayyaa - Yugayugamula Varaku Shakthimanthulamai Ninu Sthuthiyimpa - Vijayamu Nosagithivi