ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు నీవే సింహాసనాసీనుడవైతివి - YouWorship
O Karunaanidhee, Mahaa PrabhuYesu Neeve Sinhaasanaaseenudavaithivi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు (2) - నీవే సింహాసనాసీనుడవైతివి (2) 1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు (2) దావీదు తాళము కల్గియున్నావు (2) నీవు తెరచినది మూయగలేరు (2) బంధించినది తెరువగలేరెవ్వరు (2) నీ మహాత్మ్యమదే (2) 2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య సంచరించెదవు జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా అదియే నీ ఘనత 3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే ధన్యుడవు నీవే 4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమెన్ అనువాడు 5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు నిను కొనియాడెదము Pallavi: O Karunaanidhee, Mahaa PrabhuYesu (2) - Neeve Sinhaasanaaseenudavaithivi (2) 1. Sathyasvaroopivi Parishuddhadavu (2) Daaveedu Thaalamu Kalgiyunnaavu (2) Neevu Therachinadi Mooyagaleru (2) Bandhinchinadi Theruvagalerevvaru (2) Nee Mahaathmyamade (2) 2. Edu Nakshathramulu Neechetha Kalavu - Deepa Sthambhamula Madhya Sancharinchedavu Jeevinchuvaadavu Aadi Anthamulu - Rendanchula Khadgan Kaligina Prabhuvaa Adiye Nee Ghanatha 3. Agnivanti Nethramulu Kalgi - Aparaaparanji Vanti Paadamulu Kaligi Devuni Edu Aathmalu Kaligi - Grandhamu Therache Yogyudaveeve Dhanyudavu Neeve 4. Nammakamaina Sathyasaakshiyu - Sarvasrushtiki Karthayaiyundi Neethimanthudu Bahujvaalaamayudu Deerghashaanthudu Shakthimanthudu Aamen Anuvaadu 5. Ellaru Prabhuni Sthuthinchedaru - Saagila Padedaru Kruthajnyulai Aashcharyakriyalu Chesithivanchu - Prabhuvaa Neeve Agamyudavanchu Ninu Koniyaadedamu