ఓపాపి జీవపు యూటకురా - YouWorship
Opaapi Jeevapu Yootakuraa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తామసము చేయకుము - తరుణమును వీడకుము కృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను 1. ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను 2. ఉన్న పాటున రమ్ము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ ||తామ|| 3. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్ ||తామ|| 4. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు ||తామ|| 5. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను ||తామ||" 6. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు ||తామ|| 7. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్ ||తామ|| Pallavi: Thaamasamu Cheyakumu - Tharunamunu Veedakumu Krupatho Ninnu Rakshinchunu - Krupatho Rammanenu 1. Opaapi Jeevapu Yootakuraa - Paapabhaaramu Thodaraa Rakshakudu Ninnu Pilchuchunnaadu - Akshaya Jeevameeyanu 2. Unna Paatuna Rammu Yesu Noddaku - Pannuga Kaachiyunnaadu Sindhura Paapamainanu - Bandharamuga Maayamau ||Thaama|| 3. Rakshakuni Vaakkulanniyu - Rayamuna Nammuchu Pashchaaththaapamonduvaaralaku - Nishchaya Rakshana Nichchun ||Thaama|| 4. Paapi Manassu Maarunapudu - Paramandali Doothalu Santhoshagaana Vithathulache - Vinthaga Paaduduru ||Thaama|| 5. Vaakkula Neraverchina Yesu - Maata Thappanivaadu Saaku Cheppuvaarala Nella - Shikshakai Niyaminchenu ||Thaama||" 6. Yesu Nanggeekarinchuvaaralanu - Cheyunu Shuddhulugaa Yellarakunu Meluchesenu - Pilchuchunnaadipudu ||Thaama|| 7. Hallelooyaa Paatapaadedavu - Challani Aathmavalana Naathuni Neevu Vedakina - Saadhuga Eevula Nichchun ||Thaama||