ఏ రీతి స్తుతియింతును - YouWorship
Ae Reethi Sthuthiyinthunu
Artist: తాతపూడి జ్యోతి బాబు
Category: Praise
Song Lyrics
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి|| Ae Reethi Sthuthiyinthunu – O Yesu Naathaa Daivamaa Ae Reethi Varninthunu – Nee Prema Madhurambunu Nee Krupalanni Thalaposukonuchu – Nee Paadaalu Cheraanayyaa Neeku Kruthagnathalu Chellimpa Madilo – Naa Kanneellu Migilaayayyaa ||Ae Reethi|| Ekaakinai Ne Dukhaarthilo – Ae Thodu Gaanani Naaku Emauduno Etu Poduno – Etu Thochaka Nunna Nannu Ae Bhayamu Neekela Yanuchu – Abhayambu Nichchaavayyaa Ae Daari Kanabadani Vela – Nee Odilopu Daachaavayyaa ||Ae Reethi|| Ee Manushyulu Ee Vairulu – Ennenno Chesina Gaani Naa Praanamu Naa Dehamu – Nee Swaadheenambhegadayyaa Naa Swaami Naathone Untu – Naa Kaapariga Nilichaavayyaa Naakemi Spruha Leni Vela – Oopirini Posaavayyaa ||Ae Reethi|| Nee Premanu Nee Perunu – Nenennadu Maruvalenu Nee Karunanu Nee Jaalini – Ae Manishilo Choodalenu Nija Daivamu Neeve Yanuchu – Nee Vaipe Ne Choochaanayyaa Yehovaa Raaphaa Nenanuchu – Ee Swasthathanu Ichchaavayyaa ||Ae Reethi||